కమల్ హాసన్ - శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2 సినిమా సెట్స్ లో జరిగిన ఘోర ప్రమాదం వలన ముగ్గురు మరణించగా.. పది మందికి పైగా గాయపడ్డారు. కమల్ హాసన్ తో సహా నిర్మాతలు, శంకర్ కూడా బాధితులకు నష్టపరిహారం ఇచ్చినప్పటికీ ఈ కేసు ప్రస్తుతం సీబీసీఐడీ చేతికి వెళ్ళింది. ఇక ఈ కేసులో కమల్ హాసన్ తో పాటుగా నిర్మాతలు, దర్శకుడు శంకర్ కూడా పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వీరిని పోలీసులు తరుచు విచారణకు పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ కూడా నిలిచిపోయింది. కమల్ రెడీ అంటే లైకా వారు షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీగానే ఉన్నారు.
అయితే ప్రస్తుతం తనని సీబీసీఐడీ వారు పలుమార్లు పిలిచి సెట్ లో జరిగిన ప్రమాద ఘటన గురించి ప్రశ్నలతో వేధించడమే కాకుండా నా పనులకు అడ్డుతగులుతూ ఎప్పుడూ విచారణ పేరుతొ స్టేషన్ కి పిలిపిస్తున్నట్లుగా కమల్ హాసన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసాడు. తాను బిజీగా వున్నా, ఖాళీగా ఉన్నా ఎప్పుడు బడితే అప్పుడు విచారణ పేరుతో ఇబ్బంది పెడుతూ తన పనులకు ఆటంకం కలిగిస్తున్నారని.. కమల్ కోర్టులో పిటిషన్ వెయ్యగా, కమల్ అభ్యర్ధనను కోర్టు స్వీకరించి విచారణ చేపట్టనుంది. మరి ఇండియన్ 2 మళ్ళీ మొదలవుతుంది అనుకుంటే.. ఇంకా కేసు విహరణ అంటూ పోలీసులు పనులు చేసుకోనివ్వకపోతే ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు మొదలై ఎప్పుడు పూర్తవుతుందో అంటున్నారు.