రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ వస్తోందంటే ఫ్యాన్స్‌కు ఎంత సంబరం! అందుకే ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ రాగానే సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజానికి ఇది ముగ్గురు అమ్మాయిల కథ అయినప్పటికీ, ఫస్ట్ లుక్‌లో కేవలం పవన్ కల్యాణ్ లుక్ మాత్రమే రిలీజ్ చేసి, అమ్మాయిల లుక్‌ను బయట పెట్టకుండా దర్శక నిర్మాతలు పక్షపాతం ప్రదర్శించారని విమర్శలు వచ్చినప్పటికీ, జనం ఆ విమర్శల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ‘వకీల్ సాబ్’ లుక్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకు రావడమే కాకుండా దానికి ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌పై రికార్డులు అందించారు.
అలాంటి ‘వకీల్ సాబ్’ ను మే 15న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇదివరకే ప్రకటించారు. దానికి తగ్గట్లు షూటింగ్ ప్లాన్ చేశారు. అయితే సినిమాలో పవన్ కల్యాణ్ భార్య పాత్రధారిని ఇంతవరకు ఎంపిక చేయకపోవడం, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా షూటింగ్ నిలిపివేయడంతో ‘వకీల్ సాబ్’ విడుదల అనివార్యంగా వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా దిల్ రాజు నుంచి స్టేట్‌మెంట్ రావడమే మిగిలుంది. మే 15న కాకుండా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాడనేది ఇప్పుడు అసలు ప్రశ్న. మార్చి 31 తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొంటేనే షూటింగ్స్‌కు అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే రోజు రోజుకూ కరోనా వైరస్ తీవ్రత పెరుగుతూ పోతూ భయాందోళనలు రేకెత్తుతున్న పరిస్థితే ఉంది. ఇదే స్థితి కొనసాగితే ఏప్రిల్ 1 నుంచి కూడా షూటింగ్స్ జరిగే అవకాశాలుండవు.
కరోనా కేసులు పెరుగుతూ పోతుండటం వల్ల ఈ వైరస్ వ్యాప్తి ఎప్పటికి తగ్గుతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఉంది. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో ప్రస్తుతానికైతే అంచనా వేయలేకపోతున్నారు. ఒకవైపు ఎడిటింగ్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూ వచ్చినా, ఏప్రిల్ నాటికి షూటింగ్ పూర్తయితేనే మే 15న సినిమా విడుదలకు ఛాన్స్ ఉంటుంది. అది జరిగే పని కాదని ‘వకీల్ సాబ్’ యూనిట్ భావిస్తోంది. ఇప్పటికైతే జూన్ లేదా జూలైకి సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. విడుదల మరింత ఆలస్యమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పవర్ స్టార్‌ను ఎప్పుడెప్పుడు వెండితెరపై కళ్లారా చూసుకుందామా.. అని వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మరికొంత కాలం నిరీక్షణ తప్పదు.