రామ్ గోపాల్ వర్మ వివాదాలకి చిరునామా అని అందరికీ తెలుసు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయం మీద తనదైన అభిప్రాయాలని విమర్శనాత్మకంగా చెబుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కరోనా గురించి రోజూ ఏదో ఒక ట్వీట్ పెడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఎక్కువ మందిని ఆకర్షించింది.
ఇంతవరకు వ్యాక్సిన్ కనుగొనబడని కరోనా గురించి ప్రతీ ఒక్కరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తమని తాను ఇంటికే పరిమితం చేసుకుంటున్నారు. వర్మ మాత్రమ్ తనకి కరోనా వచ్చేలా చేయమని కోరుతున్నాడు. ఎప్పుడూ ఎవరో ఒకరిని గిల్లుతూ ఉండే వర్మ కరోనా సందర్భంగా కే ఏ పాల్ ని టార్గెట్ చేశాడు. కే ఏ పాల్ ని ఉద్దేశిస్తూ కరోనా ఈ భూమిని వదిలి వెళ్ళిపోవాలని మీ దేవుడికి చెప్పండంటూ కే ఏ పాల్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
ఇంకా మాట్లాడుతూ అదే కరోనాని నాకైనా రప్పించేలా చేయమని మీ దేవుడికి చెప్పండంటూ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. వర్మ ఏది చేసినా సంచలనమే అని మరో మారు ఈ ట్వీట్ ద్వారా అర్థం అయింది.