ప్రస్తుతం యూత్ లో బాగా క్రేజ్ ఉన్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి విజయంతో అతని స్థాయి పూర్తిగా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఇటు టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ అతడికి పేరుంది. అయితే గత కొన్ని రోజులుగా విజయ్ ఫ్లాపులు ఎదుర్కొంటున్నాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ రూపంలో ఫ్లాపులు అతన్ని పలకరించాయి.
ఇందులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి మరింతగా చెడ్డ పేరు వచ్చింది. ఇలాంటి సినిమాని దేవరకొండ ఎందుకు చేశాడు అంటూ అతని అభిమానులు సొషల్ మీడియా వేదికగా అతనిని ప్రశ్నించారు. మరి అంతలా డిజాస్టర్ అనిపించుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాలీవుడ్ లోకి వెళ్ళనుందని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చూసి హిందీ ఆడియన్స్ కి ఈ కథ వర్కౌట్ అవుతుందని భావించాడట.
కరణ్ జోహార్ కి విజయ్ కి మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెలిసిందే. ఆ స్నేహం కారణంగానే ప్రస్తుతం పూరిజగన్నాథ్ తో తెరకెక్కిస్తున్న ఫైటర్ మూవీని హిందీలో కరణే రిలీజ్ చేస్తున్నాడు. అందువల్లే వరల్డ్ ఫేమస్ లవర్ ని కూడా హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నాడని సమాచారం. మరి ఈ విషయమై అధికారిక సమాచారం వస్తేనే కానీ ఏ విషయం నమ్మలేం.