తెలుగులో టాప్ హీరోయిన్ ప్లేస్ లో కొనసాగుతున్న పూజాహెగ్డే స్టార్ హీరోల సరసన చేయడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ గా తయారైంది. మొదట్లో ఐరన్ లెగ్ గా అనిపించుకున్న పూజా వరుస హిట్లతో జోరు మీద ఉంది. అల వైకుంఠపురములో హిట్ తర్వాత ఆమె కథ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమెకి తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ ఆఫర్లు వరుస కడుతున్నాయి. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న పూజకి సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించే అవకాశం వచ్చిందని టాక్.అయితే సాధారణంగా పూజాకి తెలుగులో కోటి నుండి కోటిన్నర వరకిపారితోషికం ఇస్తారు.
కానీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేస్తున్న సినిమాలో నాలుగు కోట్ల వరకి ఆఫర్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఇక ఆమెని తెలుగు సినిమాల్లో చూడలేమని తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి బాలీవుడ్ లో అంత రెమ్యునరేషన్ ని పుచ్చుకున్నాక తెలుగులోనూ ఎక్కువ రెమ్యునరేషన్ కావాలని చూస్తారు. తెలుగు నిర్మాతలు హీరోయిన్ కి అంతగా ఇచ్చుకోలేరు. మార్కెట్ పరంగా హీరోయిన్లకి అంత మొత్తంలో పారితోషికం ఇస్తే వర్కౌట్ అవ్వదని తెలుసు. అందుకే ఇక ముందు పూజా హెగ్డేని తెలుగు సినిమాల్లో చూడడం కష్టమే అని తెలుస్తుంది.