సినిమా సినిమాకి తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంటూ.. ప్రేక్షకుల్లో తనకంటూ ఒక సపరేట్ స్టయిల్ ను ఏర్పరచుకుంటున్న హీరో విశ్వక్ సేన్. లేటెస్ట్ గా ఆయన హిట్ వంటి క్రైమ్ థ్రిల్లర్ తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు విశ్వక్ మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చాడు.
లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మించే చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం రేపు ఉదయం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి పాగల్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారని తెలిసింది..! విశ్వక్ సేన్ నటించే 5వ చిత్రం ఇది. ఇక ఈ చిత్రానికి సంగీతం రధాన్ అందిస్తుండగా, మణికందన్ సినెమాటోగ్రఫీమ్ గారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మిగిలిన ప్రధాన తారాగణం తెలియాల్సివుంది..!!