Advertisementt

ఆచార్య నుండి మహేష్ అవుట్.. చరణ్ ఇన్..!

Thu 19th Mar 2020 04:18 PM
chiranjeevi acharya film news,chiranjeevi,mahesh,rancharan,kajal,acharya film  ఆచార్య నుండి మహేష్ అవుట్..  చరణ్ ఇన్..!
Mahesh out of Acharya .. Charan in ..! ఆచార్య నుండి మహేష్ అవుట్.. చరణ్ ఇన్..!
Advertisement
Ads by CJ

 మెగాస్టార్ చిరంజీవి హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య.  కొణిదెల ప్రొడక్షన్ కంపినీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. కాగా ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా చిత్ర షూటింగ్ ను అర్దాంతరంగా నిలిపివేయడం జరిగింది. కరోనా నియంత్రణ  నిమిత్తం మెగాస్టార్ స్వయంగా పత్రికా ప్రకటన రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం తాజా అప్ డేట్స్ విషయానికి వస్తే ఏప్రిల్ 2నుండి ఏకధాటిగా షూటింగ్ జరపనున్నారని తెలిసింది. ఇటీవలే మెగాస్థార్ రెజీనాలపై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. అసలు విషయానికి వస్తే ఈ చిత్రం నుండి త్రిష తప్పుకున్న వెంటనే హీరోయిన్ గా మెగాస్టార్ సరసన ఎవరు చేస్తారనే విషయం ఫ్యాన్స్ లో కొంత ఉత్కంఠను రేకెత్తించింది. కాగా గ్లామరస్ స్టార్ అనుష్క ను హెరాయిన్ గా ఆచార్యలో కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ఏమాత్రం వాస్థవం లేదని తెలిసిపోయింది. తాజా సమాచారం ప్రకారం కాజల్ ని చిరు సరసన ఒకే చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..! ఇకపోతే ఒక ఇంపార్టెంట్ పాత్రలో మహేష్ నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు ఆ వార్తలు పటాపంచలు అయ్యాయి. ఈ చిత్రం నుండి మహేష్ సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. ఒక గంటపాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సీన్స్ సినిమాకి టర్నింగ్ పాయింట్ అవుతుందట. ఈ పాత్రకోసం చరణ్ అయితే కరెక్ట్ గా యాప్ట్ అవుతాడని మహేష్ సూచించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చరణ్ నటించాలి అంటే ఆర్ ఆర్ ఆర్ ఆర్ పూర్తి అవ్వాల్సిందే. అది అయ్యాకే ఆచార్యలో చరణ్ నటిస్తాడని చిత్ర యూనిట్లో టాక్ వినిపిస్తుంది..!

Mahesh out of Acharya .. Charan in ..!:

Chiranjeevi Acharya Film News

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ