Advertisementt

అక్షయ్ సినిమాలో బంపర్ ఆఫర్.. ఆమె కంటే తనకే ఎక్కువ..

Wed 18th Mar 2020 02:29 AM
pooja hegde,akshay kumar,bachan pandey  అక్షయ్ సినిమాలో బంపర్ ఆఫర్.. ఆమె కంటే తనకే ఎక్కువ..
Pooja got bumper offer in Akshar kumar movie అక్షయ్ సినిమాలో బంపర్ ఆఫర్.. ఆమె కంటే తనకే ఎక్కువ..
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో అరడజనుకి పైగా చిత్రాలు ఉన్నాయి. సినిమా తర్వాత సినిమా ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లయిన ఖాన్ త్రయం సినిమాల విషయంలో తడబడుతుంటే అక్షయ్ మాత్రం ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా సినిమాలు చేసుకుంటూ హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు.

అయితే ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటిస్తున్న బచ్చన్ పాండే చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుంది. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక నాయికగా కృతి సనన్ నటిస్తుండగా మరో హీరోయిన్ గా పూజాని ఎంపిక చేశారట. ఇద్దరు హీరోయిన్లు ఉన్నఈ చిత్రంలో కృతి సనన్ పాత్ర కంటే పూజా పాత్రే ఎక్కువ హైలైట్ గా ఉండబోతుందని సమాచారం.

ఈ పాత్ర గనక హిట్ అయితే బాలీవుడ్ లో పూజా సెటిల్ అయినట్టే అని అంటున్నారు. ఇప్పటి వరకు పూజా బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు దక్కిమ్చుకోలేదు. తెలుగులో టాప్ హీరోల మొదటి ఛాయిస్ గా ఉన్న పూజా అక్షయ్ కుమార్ సినిమాతో బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటుందా లేదా చూడాలి.

Pooja got bumper offer in Akshar kumar movie:

Pooja got bumper offer in Akshay kumar movie. Her role would be so special in that film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ