‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోతో హైపర్ ఆదీకి ఎంతపేరు వచ్చిందో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ఆయన పంచ్‌లు, టైమింగ్ అదుర్స్ అంతే. ఇప్పటి వరకూ తెలుగులో ఉన్న కామెడీ షోలు ఈయన్ను ఢీ కొట్టలేకపోయాయ్. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ అయిన ఆదీ.. అన్నీ వదిలేసుకుని కామెడీ అంటే ఫ్యాషన్‌తో ‘జబర్దస్త్’ ఎంట్రీ ఇచ్చాడు. అలా నాటి నుంచి నేటి వరకూ ఆదీని ఎవరూ కొట్టలేకపోయారు. అలా బుల్లి తెరపై.. అప్పుడప్పుడూ వెండితెరపై.. మరోవైపు యాంకర్‌గానూ ఆయన రాణిస్తున్నాడు. ఆయన స్కిట్‌లో ఎంత కామెడీ చేస్తాడో అంతకు డబుల్ ఓవారాక్షన్.. మరీ ముఖ్యంగా ఎంతసేపూ వాళ్ల మీద.. వీళ్ల మీదా పంచ్‌లు వేస్తుంటాడని.. తన మీద చిన్న పంచ్ వేసినా అస్సలు ఒప్పుకోడనే ఆరోపణలు కూడా ఉన్నాయ్. ఏదైతేనేం ఇప్పట్లో ఆయన స్కిట్‌ను మాత్రం కొట్టే వాడే లేడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.
సీనియర్లే జలసీగా..!
అదేదో సామెత ఉంది కదా.. తాడిని తన్నేవాడు ఇక్కడ ఉంటే.. తలను తన్నేవాడు ఉంటాడన్నట్లుగా ఆదీనే కొట్టే సద్దాం రంగంలోకి దిగిపోయాడు. వాస్తవానికి సద్దాం ‘పటాస్’తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆ షో నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా మంది బయటికొచ్చేసి జబర్దస్త్‌తో పాటు ఇంకొన్ని షోలు చేసుకుంటూ వచ్చారు. అయితే ‘అదిరింది’ షో రావడంతో వీళ్లందరికీ మంచి రోజులొచ్చాయ్.. వీళ్ల పొలంలోనూ మొలకొలొచ్చాయ్. ‘గల్లీ బాయ్స్’ పేరుతో యాదమ్మ రాజు, బుడ్డోడు, భాస్కర్‌తో కలిసి సద్దాం హుస్సేన్ టీమ్ ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగాడు. మొదట ఈ స్కిట్లలో పసలేనప్పటికీ.. రానురానూ ఫుల్‌గా డెవలప్ చేసుకుని ఇప్పుడు సీనియర్లను సైతం ఢీ కొట్టి.. తనకే ఫుల్ మార్కులు పడేలా చూసుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జబర్దస్త్ నుంచి సీనియర్ కమెడియన్స్, కంటెస్టెంట్స్ కూడా సద్దాం స్కిట్ చూసి జలసీగా ఫీలయ్యేలా చేస్తున్నాడట.
అటు ఆదీ.. ఇటు సద్దాం!
మొదట ‘జబర్దస్త్’ వర్సెస్ ‘అదిరింది’ అనే పరిస్థితులు ఉన్నప్పటికీ అంతా అదరగొట్టలేదు. నిదానంగా ఒక్కొక్కరుగా స్కిట్‌లో మంచి మంచి కంటెంట్ చూపించడంతో ప్రేక్షకులు అదిరింది కూడా ఆదరించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ‘జబర్దస్త్’లో హైపర్ ఆదీ ఎలాగో.. ‘అదిరింది’ లో సద్దాం టీమ్ కూడా అలా తయారైంది. అంతేకాదు.. ఆదీ స్కిట్‌లనే మించిపోయాడు కూడా. యూట్యూబ్‌లో ఈ ఇద్దరి స్కిట్‌లకు సంబంధించిన వీడియోలు పోటాపోటీగా వ్యూస్ సంపాదించుకుంటున్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆదీకి గట్టిగానే సద్దాం పోటీ ఇస్తున్నాడన్న మాట.
టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..!
ముఖ్యంగా సద్దాం డైలాగ్స్ అయితేనేం.. పంచ్‌లు, టైమింగ్ కిరాక్ అంతే. అంతేకాదు.. టీమ్‌లోని అందరికీ సమన్యాయం చేస్తూ ఎవరికిచ్చే డైలాగ్ వాళ్లకిస్తూ టీమ్ లీడర్‌గా రాణించేస్తున్నాడు. అయితే ఆదీ టీమ్‌లో ఇలా న్యాయం జరగదనే ఆరోపణలు మెండుగానే ఉన్నాయ్. ఆదీకి ఏ మాత్రం తగ్గకుండా డైలాగ్స్ పేల్చుతుండటంతో నెటిజన్లు కూడా.. హైపర్‌నే సద్దాం కొట్టేస్తున్నాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ‘ఆదీ కాకపోతే సద్దాం’ అని తన స్కిట్‌లలో సైతం సద్దాం చెప్పేసుకుంటున్నాడు. ఏదైతేనేం టాలెంట్ అనేది ఎవరి సొత్తూ కాదు.. సమయం, సందర్భం.. సరైన ఫ్లాట్‌ఫామ్ దొరికినప్పుడు దానంతట అదే బయటపడుందని సద్దాం విషయంలో రుజువైందని చెప్పుకోవచ్చు. ఎనీవే కీప్ ఇట్ అప్ సద్దాం..!