Advertisementt

మహేశ్‌కు పూరీనే గతి.. నమ్రత రాయబారం!?

Thu 19th Mar 2020 12:42 PM
janaganamana,puri jagannadh,mahesh babu,namratha,super star mahesh  మహేశ్‌కు పూరీనే గతి.. నమ్రత రాయబారం!?
Finally Mahesh Movie With Puri Jagannadh! మహేశ్‌కు పూరీనే గతి.. నమ్రత రాయబారం!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘జనగణమన’ చిత్రాన్ని తెరకెక్కించాలని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎప్పట్నుంచో అనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పూరీ వరుస ప్లాప్‌లతో సతమతం అవ్వడంతో.. ఆయనతో పనిచేయడానికి మహేశ్ అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ మహేశ్‌తోనే సినిమా తీయాలని మైండ్‌లో పూరీ ఫిక్స్ అయిపోయాడు. అయినప్పటికీ మహేశ్ నుంచి ఎలాంటి స్పందన కాదు కదా.. లెక్కచేయలేదు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పూరీకి మళ్లీ పాత రోజులొచ్చేశాయ్. దీంతో పూరీ కోసం మళ్లీ హీరోలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం పూరీ దగ్గర చాలానే కథలున్నాయ్ కానీ.. సరైన హీరో దొరకట్లేదు.

వాస్తవానికి.. అప్పట్లో ఈ కథను టాలీవుడ్‌లో యంగ్ రెబల్ ప్రభాస్‌, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌, విజయదేవరకొండ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరితో ఉంటుందని వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయ్. అంతేకాదు.. కేజీఎఫ్ హీరో యష్‌తో కూడా బెంగళూరు వెళ్లి మరీ చర్చించారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయ్. తాజా సమాచారం మేరకు అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఈ కథ మహేశ్‌కే వచ్చేసిందట. అదెలాగంటే ఎంత మంది దర్శకులు కథలు చెప్పినా మహేశ్‌కు నచ్చకపోవడం.. పైగా మెగాస్టార్ చిరంజీవి సినిమాను కూడా అత్యాశకు పోయి చేజేతులారా పోగొట్టుకోవడం.. ఇలా వరుస ఘటనలు చూసి ప్రిన్స్ సతీమణి నమ్రత ఫీలయ్యిందట.

ఇవన్నీ ఎందుకిక.. పూరీ సార్‌తో స్వయంగా తానే వెళ్లి మాట్లాడుతానని మహేశ్‌కు చెప్పిందట. మొదట మహేశ్ ఒప్పుకోకపోయినప్పటికీ ఆయన్ను కూర్చోబెట్టి మరీ క్లాస్ పీకిందట. ఆఖరికి సతీమణి మాటను కాదనలేకపోయిన సూపర్‌స్టార్ ఓకే చెప్పేశాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే నమ్రత.. పూరీని కలిసి ఆయన్ను ఒప్పించేందుకు వెళ్తుందట. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా కూడా ఆపేసి పూరీ ఖాళీగానే ఉన్నాడు. వీలు చూసుకుని నమ్రత.. పూరీని కలవనుందట. అంటే పూరీ-మహేశ్ మధ్య నమ్రత రాయబారం నడుపుతోందన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే.

Finally Mahesh Movie With Puri Jagannadh!:

Finally Mahesh Movie With Puri Jagannadh!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ