అందాల రాక్షసి సినిమాతో తెలుగులో ఒక విభిన్నమైన ప్రేమ కథని తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి ఆ సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకోగలిగాడు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన హను ఆయన నుండి చాలానే నేర్చుకున్నాడని, ఆయనలా సినిమాలు తీయగలడని భావించారు. అందాల రాక్షసి తో మెప్పించి హను ఆ తర్వాత క్రిష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో ఫర్వాలేదనిపించాడు.
నాని హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తారు విజయం సాధించింది. అయితే ఆ తర్వాత వచ్చిన పడి పడి లేచే మనసు చిత్రం మాత్రం ఘోరంగా విఫలమైంది. శర్వానంద్ హీరోగా చేసిన ఈ చిత్రానికి అనుకున్న దానికంటేఎక్కువ బడ్జెట్ అవడంతో సినిమా అంతలా రాబట్టలేకపోయింది. అయితే అప్పటి నుండి హను ఖాళీగానే ఉన్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం హను రాఘవపూడికి హీరో దొరికేశాడట.
మహానటి చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన మళయాల నటుడు దుల్కర్ సల్మాన్ కి హను కథ వినిపించాడట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ కథ ఓకే అయితే దుల్కర్ సల్మాన్ సోలో హీరోగా చేయబోయే మొదటి చిత్రం ఇదే అవుతుంది. దుల్కర్ కి తెలుగులోనూ మంచి పాపులారిటీనే ఉంది. మొత్తానికి హనుకి మంచి హీరోనే దొరికాడు.