ఎప్పుడూ లేనిది ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతోంది. ఆర్ధిక వ్యవస్థ, రవాణా వ్యవస్థ అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోజువారీ పనిచేసుకుని కడుపు నింపుకునే కూలీల పొట్ట మీద కొట్టింది కరోనా. ఓ పక్క స్టాక్ మార్క్స్ పతనం, మరోపక్క జనజీవనం అస్తవ్యస్తం. ఇలాంటి సమయంలో సినిమాల పరిస్థితి అగమ్యగోచరమే. ప్రస్తుతం షూటింగ్స్ వాయిదా పడి, మరోపక్క సినిమాలు పోస్ట్ పోన్ అయ్యి.. ఇటు రోజువారీ వేతనం అందుకునే సినిమా ఆర్టిస్ట్ ల బాధ వర్ణనాతీతం. ఈ వారం సినిమాలు అన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. అవి ఎప్పుడో ఇప్పుడే డేట్ కూడా ఇవ్వలేని పరిస్థితి.
దానితో ఏప్రిల్ మొదటివారం విడుదలవ్వాల్సిన నిశ్శబ్దం, ఉప్పెన చిత్రాల పరిస్థితి ఏమిటో తెలియదు. అలాగే వేసవి సెలవుల్లో సినిమాల మీద సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ ఈ ఏడాది ఎప్పుడు ఏ సినిమా విడుదలవుతుంది ముందే డేట్స్ ఇచ్చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల డేట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. పిల్లలకి సెలవులిచ్చారు. కానీ ధియేటర్లు బంద్. ఒకవేళ ధియేటర్లు ఓపెన్ చేసినా సినిమాలు విడుదల ఆపెయ్యడంతో సరైన సినిమాలు చూడడానికి లేవు. మామూలుగానే ఈ ఏడాది ఒక్క భారీ బడ్జెట్ సినిమా కూడా ఆ వేసవి సెలవుల లిస్ట్ లో లేదు. కానీ పవన్ నటిస్తున్న సినిమాతో పాటు కాస్త ఇంట్రెస్టింగ్ తో ఉన్న మీడియం రేంజ్ సినిమాలు ఉన్నాయి.
అయినా.. ప్రస్తుతం కరోనా పరిస్థితి ఎప్పుడు చక్కబడి సినిమాలు విడుదలవుతాయో కానీ ప్రస్తుతం ధియేటర్లు బంద్ తో చాలామంది ప్రేక్షకులు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, సన్ డైరెక్ట్, హాట్ స్టార్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్స్ లో సినిమాలు వీక్షిస్తున్నారు. కరోనా దెబ్బ ధియేటర్లు మీద సినిమాల మీద ఎంత ప్రభావం చూపుతుందో తెలియదు కానీ. ప్రస్తుతం డిజిటల్ ఫాల్ట్ ఫార్మ్స్ పని మాత్రం యమా రంజుగా ఉంది.