Advertisementt

రోజా.. సింపేశావ్ పో.. పండగ అంతే!

Tue 17th Mar 2020 03:01 PM
roja,extraordinary dance,samajavaragamana,sekhar master  రోజా.. సింపేశావ్ పో.. పండగ అంతే!
Roja Extraordinary Dance..For Samajavaragamana! రోజా.. సింపేశావ్ పో.. పండగ అంతే!
Advertisement
Ads by CJ

వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అటు రాజకీయాల్లో ఇటు బుల్లితెరపై విజయవంతంగా రాణిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ రాజకీయాల్లోకి వచ్చిన మరెవ్వరకీ సాధ్యంకాని విధంగా విజయంతంగా బండి నడిపేస్తోంది. అటు రాజకీయాల్లో.. బుల్లి, వెండి తెరపై రాణించాలంటే కాస్త కష్టమే అయినప్పటికీ రోజా మాత్రం అలవోకగా అలా అలా రాణించేస్తోంది. మరీ ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు.. ‘జబర్దస్త్’ షో నుంచి వెళ్లిపోయినప్పటికీ.. నాటికి నేటికీ ఏ మాత్రం టీఆర్పీ రేటింగ్స్‌లో తేడా లేకుండా.. సింగిల్ హ్యాండ్‌తోనే నడిపించేస్తోంది. రోజా ఒక్కరే నడిపించేస్తారనే మరెవ్వరినీ పర్మినెంట్ జడ్జీగా తీసుకోకుండానే.. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా పోయే గెస్ట్ జడ్జిలను మాత్రమే తీసుకుంటున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. ఉగాది పండగ సందర్భంగా ‘పండగ సార్.. పండగ అంతే’ అంటూ స్పెషల్ ప్రోగ్రామ్‌ను మల్లెమాల నిర్వహిస్తోంది. పండగకు ఇంకా టైమ్ ఉండగా ఇప్పట్నుంచే హైప్ షురూ చేశారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి మూడు ప్రోమోలు రిలీజ్ చేయడం జరిగింది. మొదటి ప్రోమోలో రోజా, శేఖర్ మాస్టర్ డ్యాన్స్‌తో దుమ్ములేపేశారు. ‘అలవైకుంఠపురములో..’ లోని సామజవరగమణ అనే పాటకు రోజా డ్యాన్స్ అదరగొట్టేసింది. మరోవైపు శేఖర్ మాస్టర్ ఫ్లోర్ స్టెప్ వేస్తూ పిచ్చెక్కించేశాడు. రోజా కూడా తనలోని పాత నాట్యమయూరిని నిద్రలేపి సింపేసింది. వామ్మో రోజాలో అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేదుగా దుమ్ములేపేస్తోందిగా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆ ఒక్క పాటకే కాదు మరో మాస్ సాంగ్‌కు రోజా స్పెషల్ డ్రెస్‌తో దర్శనమివ్వగా.. శేఖర్ మాస్టర్ పంచెకట్టు ఊరమాస్ డ్యాన్స్ ఇరగదీశారు. ఈ ప్రోమోలను బట్టి చూస్తే షో ఎక్కడికో వెళ్లిపోతుందని కచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే.. రోజా డ్యా్న్స్‌పై ఏ రేంజ్‌లో పొగడ్తలు వస్తున్నాయో.. అంతకు రెట్టింపుగా తిట్ల దండకం కూడా నెటిజన్లు మొదలెట్టేశారు. మీరు ఎమ్మెల్యేగా ఉండి.. ప్రజాప్రతినిధిగా ఇలా చేయడమేంటి..? అని తిట్టిపోస్తున్నారు. ఇంకొదరైతే చెప్పుకోలేని మీమ్స్ పోస్ట్ చేస్తూ దండాలెట్టేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కామెంట్స్, మీమ్స్ కొన్ని నవ్వులు కురిపించేలా ఉండగా.. మరికొన్ని మాత్రం నరనరాన మంట పట్టించేవిగా ఉన్నాయ్. ఏదైతేనేం రాజకీయాలు రాజకీయాలే.. షోలు షోలే.. రీల్ రీల్ అంతే.. రాజకీయాలు రాజకీయాలంతే మరి.

Roja Extraordinary Dance..For Samajavaragamana!:

Roja Extraordinary Dance..For Samajavaragamana!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ