Advertisementt

బన్నీకే షాకిచ్చిన కొడుకు.. స్టార్ హీరో రియాక్షన్!

Tue 17th Mar 2020 12:42 PM
ayan,allu ayanm allu arjun son,bunny,tiger shroff  బన్నీకే షాకిచ్చిన కొడుకు.. స్టార్ హీరో రియాక్షన్!
Ayan Gives Shock To bunny.. Star Hero Reaction! బన్నీకే షాకిచ్చిన కొడుకు.. స్టార్ హీరో రియాక్షన్!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి.. ఆయన కుమారుడు అయాన్ ఊహించని షాకే ఇచ్చాడు. అయాన్ రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన మెగాభిమానులు ఒకింత కంగుతింటున్నారు. ఇదేంట్రా బాబోయ్ అయాన్ ఇంత మాట అనేశాడని అనుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అయాన్‌కు ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి మెగా హీరోలు అస్సలే కాదట. బాలీవుడ్ స్టారో హీరోల్లో ఒకరైన టైగర్ ష్రాఫ్ అంటే తెగ ఇష్టమట. అంతేకాదండోయ్.. టైగర్ ష్రాఫ్ నటించిన ‘భాఘీ’ సిరీస్ సినిమాల్లోని ఫైట్స్ అంటే చాలా ఇష్టమని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 

అసలేం జరిగిందంటే..

టైగర్ సార్ బాఘీ-3 సెట్‌కు నన్ను పిలవండి సార్అని రెక్వెస్ట్ కూడా పెట్టాడు. అయితే బుడ్డోడు కదా నోరు తిరగకపోవడంతో టైగర్ ష్రాఫ్ పేరును టైగర్ స్క్వాష్ అని పలికాడు. అయితే.. బన్నీ షేర్ చేసిన ఈ వీడియోకు టైగర్ స్పందించాడు. ‘ ఒక్క భాఘీ-3 సెట్‌కే కాదు నేను నటిస్తున్న అన్ని సినిమాల సెట్స్‌కు ఆహ్వానిస్తున్నాను. నా మాటగా అయాన్‌కు చెప్పండి అల్లు అర్జున్ సర్. నా పేరును టైగర్ స్వ్కాష్ అని పిలవడం మాత్రం కొత్తగా ఉంది’ అని టైగర్ ఫ్రాఫ్ రిప్లై ఇచ్చాడు. ఆయన రిప్లయ్ చూసిన బన్నీ, అయాన్ ఇద్దరూ మురిసిపోయారు.

Ayan Gives Shock To bunny.. Star Hero Reaction!:

Ayan Gives Shock To bunny.. Star Hero Reaction!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ