క్యాస్టింగ్ కౌచ్ టాలీవుడ్ మొదలుకుని హాలీవుడ్ ఇదో పెద్ద రోగంలా ఉంది.!. స్టార్ హీరోయిన్లు మొదలుకుని శ్రీరెడ్డి వరకూ ఎంతోమంది ఈ వివాదంపై పోరాడారు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే.. ఈ వివాదం పెద్దలను తిట్టి పోసే దాకా కూడా వెళ్లింది. ఇక ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు.. టీవీ చానెల్స్ డిబెట్స్, సోషల్ మీడియాలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈమె చేసిన ఈ హడావుడికి చాలా మందే తోడయ్యారు కూడా. అయితే ఈమె ఉద్యమంతో కాస్తో కూస్తో మార్పు కూడా వచ్చిందనుకోండి. ప్రస్తుతం తెలుగు వరకు అయితే మాత్రం ఎక్కడా క్యాస్టింగ్ కౌచ్ అనే హడావుడి మాత్రం అస్సలు కనిపించట్లేదు.
ఇక అసలు విషయానికొస్తే.. వాణీ భోజన్ అనే నటీమణి కూడా ఓ ప్రొడ్యూసర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘గతంలో నేను సినిమాలో ఆఫర్ కోసం అని ఓ ప్రొడ్యూసర్‌ను కలిశాను. అవకాశం ఇవ్వాలంటే నన్ను బెడ్రూమ్‌కు రమ్మన్నాడు. నేను కూడా ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను’ అని వాణీ చెప్పుకొచ్చింది. అయితే ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు..? సెక్సువల్ ఆఫర్ అడిగిన ప్రొడ్యూసర్ పేరు మాత్రం లీకు చేయడానికి ఆ భామ సాహసించలేదు. అంతేకాదు.. చిన్నపాటి క్లూ కూడా ఇవ్వకపోవడంతో ఇంతకీ ఆయనెవరు..? అని సదరు ప్రేక్షకులో ఆలోచనలో పడ్డారు.
కాగా.. వాణీ భోజన్ విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అంతకుమునుపు తమిళ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మీకు మాత్రమే చెబుతా అని చెప్పిన ఈ భామ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో అడ్రస్ లేకుండా పోయింది. తాజాగా ఇలా ప్రొడ్యూసర్‌పై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది.