Advertisementt

నిఖిల్ పెళ్లి ఓకే.. నితిన్ పెళ్లిపై డౌట్!

Mon 16th Mar 2020 08:44 PM
tollywood young heros,nithin,nikhil marriage,corona effect,tollywood  నిఖిల్ పెళ్లి ఓకే.. నితిన్ పెళ్లిపై డౌట్!
Clarity On Tollywood Young Heros Nithin, Nikhil Marriage నిఖిల్ పెళ్లి ఓకే.. నితిన్ పెళ్లిపై డౌట్!
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాలకు సైతం పాకడంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటికి రావాలన్నా.. బయటి దేశాలనుంచి ఇంటికి రావాలన్నా జంకిపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ పెద్దలు కూడా సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు, థియేటర్స్ సైతం బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో విద్యాసంస్థలు మొదలుకుని పబ్‌లు, జిమ్‌లు, షాపింగ్ మాల్స్ దాదాపు అన్నీ మూసేయాలని ఆదేశించారు. 

టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్, నిఖిల్ ఇద్దరూ త్వరలోనో ఓ ఇంటివాళ్లవుతున్నారు. నిఖిల్ పెళ్లి ఏప్రిల్-16న జరగనుండగా.. నితిన్ పెళ్లి ఏప్రిల్ 15న దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఆ మరుసటి రోజే హైదరాబాద్‌లో గ్రాండ్‌గా 16 రిసెప్షన్ చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఈ పెళ్లి జరగదు.. కష్టమేనని వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయ్. అంతేకాదు.. ఈ ఏడాది పెళ్లి కష్టమేనని వచ్చే ఏడాదే వివాహం ఉంటుందని కూడా వార్తలు వచ్చేశాయ్. దీంతో ఎట్టకేలకు నిఖిల్.. నితిన్ తరఫు పెద్దలు క్లారిటీ ఇచ్చుకున్నారు.

కరోనా కాదు ఏదొచ్చినా చేస్కుంటా..!

నా పెళ్లి వాయిదా పడిందనేది అవాస్తవం.. వదంతులు ఎవరూ నమ్మకండి. ఆరు నూరైనా పెళ్లిని వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. నా పెళ్లిపై ఆందోళన అక్కర్లేదు. కరోనా కాదు కదా.. ఏదొచ్చినా మా పెళ్లి అనుకున్న సమయానికి ఖచ్చితంగా జరగుతుంది. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే.. మేం ఇద్దరం గుళ్లోకి వెళైనా సరే పెళ్లి చేసేసుకుంటాం.. మా పెళ్లిని ఎవరూ ఆపలేరు. మేం చేయాల్సింది మే చేస్తాం. జీవితంలో పెళ్లి అనేది గొప్ప ఫీలింగ్. కాని ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మా పెళ్లికి వచ్చేవారి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమేఅని నిఖిల్ క్లారిటీ ఇచ్చేశాడు.

నితిన్ పెళ్లి డౌటే..!

నితిన్ పెళ్లి వాయిదా విషయంపై తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నితిన్ పెళ్లి వేదికను మార్చే ఆలోచనలో ఉన్నామన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దుబాయ్ నిర్వహించడం కష్టంగా మారిందని.. అయితే అక్కడే చేయాలా? లేక వేదిక మార్చుకోవాలా..? వాయిదా వేసుకోవాలా? అన్నదానిపై ఇరు కుటుంబాల వాళ్లంతా ఆలోచిస్తున్నామన్నామన్నారు. పెళ్లికి వచ్చే గెస్ట్‌లకు ఇబ్బందులు కలగకుండా బెటర్ ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నామని.. అయితే పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో సానుకూలత ఏర్పడుతుందని.. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయని ఆశిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు. మరి ఫైనల్ ఇరు కుటుంబాలు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మొత్తానికి చూస్తే.. నిఖిల్ పెళ్లి ఓకే గానీ.. నితిన్ పెళ్లిపైనే సందేహాలు నెలకొన్నాయ్.

Clarity On Tollywood Young Heros Nithin, Nikhil Marriage:

Clarity On Tollywood Young Heros Nithin, Nikhil Marriage  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ