Advertisementt

ఈ దర్శకుడు రవితేజకు సినిమా చూపిస్తాడంట!

Mon 16th Mar 2020 08:40 PM
raviteja,director,trinadha rao nakkina,new movie  ఈ దర్శకుడు రవితేజకు సినిమా చూపిస్తాడంట!
Raviteja Film with Cinema Choopista Mava Movie Director ఈ దర్శకుడు రవితేజకు సినిమా చూపిస్తాడంట!
Advertisement
Ads by CJ

రవితేజకు సినిమా చూపిస్తా మావ అంటున్న దర్శకుడు!!

డిస్కోరాజా వంటి డిజాస్టర్ ప్లాప్ తర్వాత రవితేజ కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడని.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్ మూవీలో నటిస్తున్నాడు. దీని తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ఒకటి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రవితేజ మరో నూతన చిత్రం కమిట్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సినిమా చూపిస్తా మావ, నేను లోకల్, చిత్రాల దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన చెప్పిన సబ్జెక్టు నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెజవాడ ప్రసన్న కుమార్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ కథను అందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా  ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా టి.జి.విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తారని ఫిలిం నగర్ సమాచారం..!!

రవితేజ, త్రినాథ రావ్ నక్కిన, టిజి.విశ్వ ప్రసాద్ ఫీల్ న్యూస్

Raviteja Film with Cinema Choopista Mava Movie Director:

Raviteja and Trinadha Rao Nakkina Movie on Cards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ