ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ షోతో చాలామంది కమెడియన్స్ అసలు ఎవరికీ పరిచయం లేని వారు బుల్లితెరకు పరిచయమై వారి హావభావాలతో.. కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరవడమే కాదు. జబర్దస్త్ కొచ్చిన క్రేజ్ తో వెండితెర మీద కూడా సెటిల్ అయ్యారు. చాలామంది కమెడియన్స్ హీరోలైతే కొంతమంది సపోర్టింగ్ రోల్స్, మరికొంతమంది కామెడీ కేరెక్టర్స్ తో చాలా బిజీ అయ్యారు. జబర్దస్త్ పుణ్యమా అని చాలామంది లక్షలు లక్షలు సంపాదిస్తూ సొంత ఇల్లు కొనుక్కున్నారు. అయితే అంతలా జబర్దస్త్ లైఫ్ ఇస్తే.. కాదు మా టాలెంట్ తోనే మేము పైకొచ్చాం కానీ జబర్దస్త్ వల్ల కాదంటూ ఇప్పుడొక కమెడియన్ జబర్దస్త్ షో మీద హాట్ హాట్ గా రెచ్చిపోయాడు.
అతనెవరో కాదు.. నాగబాబుకి బాగా దగ్గరైన ఆర్పీ. జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్ తో ఎంట్రీ ఇచ్చి తర్వాత టీం లీడర్ అయ్యి స్కిట్స్ చేస్తున్న ఆర్పీ. ఈమధ్యన నాగబాబుతో కలిసి మల్లెమాలకి బై బై చెప్పేసి జీ ఛానల్ అదిరింది ప్రోగ్రాంలో కామెడీ స్కిట్స్ చేస్తున్నాడు. జబర్దస్త్ నుండి మల్లెమాలకి హ్యాండ్ ఇచ్చి వెళ్లినవాళ్లెవరూ జబర్దస్త్ ని పల్లెత్తి మాట అనలేదు కానీ ఆర్పీ మాత్రం జబర్దస్త్ తనకి లైఫ్ ఇవ్వలేదని, లైఫ్ ఇవ్వడమంటే రోడ్డు మీద పోయేవాళ్ళని తీసుకొచ్చి అన్నం పెట్టడం అని, కానీ మేము చాలా కష్టపడే పైకొచ్చాం. మా టాలెంట్ ని వాడుకుని మాకు డబ్బు ఇచ్చారు. అలాగే మా టాలెంట్ తోనే మాకు క్రేజ్ వచ్చింది. కానీ జబర్దస్త్ తో మాకేమి ఒరగలేదు అంటూ రెచ్చిపోయాడు. మరి మల్లెమాలతో గొడవ పెట్టుకుని ఆర్పీ నాగబాబు వెంట నడిచాడనే ప్రచారంలో ఎంతోకొంత నిజముంది అనిపిస్తుంది ప్రస్తుతం ఆర్పీ మాటలు వింటుంటే. ఇక ఈటీవీలో ఛస్తే ప్రోగ్రాం చెయ్యనని చెబుతున్నాడు ఆర్పీ. మరి ఆర్పీకి అంతగా కాలడానికి కారణమేమిటో కదా.