చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న ‘ఆచార్య’ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ‘15 ఇయర్స్ ఇండస్ట్రీ’ అనుష్కను తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అవును. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నుంచి క్రియేటివ్ డిఫరెన్సులతో తప్పుకుంటున్నట్లు త్రిష స్వయంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ షాకయ్యారు. ఏ విషయంలో, ఎవరితో డిఫరెన్సులు వచ్చాయో ఆమె కానీ, డైరెక్టర్ కొరటాల కానీ, చిత్ర బృందంలో మరెవరు కానీ చెప్పలేదు. అసలు త్రిష ప్రకటన తర్వాత దానిపై ‘ఆచార్య’ యూనిట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఒక్క సీన్ తీయకముందే త్రిష తప్పుకోవడం కొంతవరకు నయమే. లేనట్లయితే ఆ సీన్లన్నీ వృథా అయిపోయేవే.
పోయిన వారమే చిరంజీవితో త్రిష కాంబినేషన్ సీన్లను డైరెక్టర్ కొరటాల ప్లాన్ చేశాడు. ఆమె తప్పుకోవడంతో షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యింది. వెంటనే ఆమె స్థానంలో మరొకరిని తీసుకోవడం, మళ్లీ షెడ్యూల్ ప్లాన్ చేయడం అనేది నిర్మాతలకు ఆర్థికంగా కొంత నష్టాన్ని చేకూర్చే విషయమే. త్రిష స్థానంలో ‘ఖైదీ నంబర్ 150’ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈలోగా కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిరంజీవి నుంచి ప్రకటన వచ్చేసింది. దీంతో హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి దర్శక నిర్మాతలకు కొంత వెసులుబాటు కలిగింది.
కాజల్‌కు ప్రస్తుతం పెద్ద డిమాండ్ ఏమీ లేదు కాబట్టి, ఆమె డేట్స్ సునాయాసంగా లభిస్తాయనుకున్న నిర్మాతలకు షాక్ తగిలిందనీ, ఆమె అడిగిన రెమ్యూనరేషన్‌కు వాళ్ల మైండ్ బ్లాక్ అయ్యిందనీ ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతుందో తెలీదు కానీ, తాజాగా నిర్మాతలు అనుష్కను సంప్రదిస్తున్నట్లు గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇప్పటివరకూ మెగాస్టార్ సరసన అనుష్క ఫుల్ లెంగ్త్ రోల్ చెయ్యలేదు. ‘స్టాలిన్’ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో ఆయనతో కలిసి డాన్స్ చేసిన ఆమె, ‘సైరా’లో ఝాన్సీ లక్ష్మీబాయ్ క్యారెక్టర్‌లో కనిపించింది. అందులో చిరంజీవితో ఆమెకు కాంబినేషన్ సీన్స్ లేవు. దాంతో అనుష్క కనుక ‘ఆచార్య’లో నటించేట్లయితే చిరుతో ఆమెది ఫ్రెష్ కాంబినేషన్‌లా ఉంటుందని చెప్పవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.