Advertisementt

బిగ్ బాస్ పాపులారిటీ ముందు హీరోలూ బలాదూరే..

Sun 15th Mar 2020 05:25 PM
rahul sipligunj,raj tharun,orey bujjigaa  బిగ్ బాస్ పాపులారిటీ ముందు హీరోలూ బలాదూరే..
Rahul sipligunj has more popularity than Hero బిగ్ బాస్ పాపులారిటీ ముందు హీరోలూ బలాదూరే..
Advertisement
Ads by CJ

టెలివిజన్ లో అత్యంత ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న ప్రోగ్రామ్ గా రికార్డు సృష్టించిన బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ఇప్పటి వరకు మూడు సీజన్లు కమ్ప్లీట్ చేసుకున్న ఈ షోలో పార్టిసిపేంట్స్ కి జనాల్లో చాలా పాపులారిటీ ఉంది. అప్పటి వరకు మీడియాలో ఉండని వాళ్ళు కూడా ఈ షో ద్వారా హైలైట్ అయ్యి తమ పేరు ముందు బిగ్ బాస్ ట్యాగ్ ని తగిలించుకుంటున్నారు. గత ఏడాది మూడవ సీజన్ బిగ్ బాస్ విజేతగా టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే అప్పటి నుండి రాహుల్ కి జనాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అతడు ఎక్కడికెళ్ళినా జనాలు అతనితో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అతని ఫాలోయింగ్ చూసి హీరోలు సైతం కుళ్ళుకుంటున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఒరేయ్ బుజ్జిగా ఈవెంట్ కి వెళ్ళాడు. అక్కడ రాహుల్ తో సెల్పీలు దిగడానికి జనం ఎగబడ్డారు. అలాగే రాహుల్ పాట పాడితే అరుపులతో గోల గోల చేశారు. మొత్తానికి ఆ సినిమాలో హీరో రాహులే కావచ్చేమో అన్న రేంజ్ లో సాగింది. రాహుల్ కి వస్తున్న ఆదరణ చూసి రాజ్ తరుణ్ కూడా నాహీరో రాహులే అని చెప్పాల్సి వచ్చింది. మరి బిగ్ బాసా మజాకా..!

Rahul sipligunj has more popularity than Hero:

Rahul Sipligunj has more poipularity than Raj Tharun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ