నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. అఖిల్ మాత్రం హీరోగా సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. మూడు సినిమాలు ముచ్చటగా అఖిల్ కి ప్లాప్స్ నే ఇచ్చాయి కానీ ఒక్క సినిమా కూడా యావరేజ్ రేంజ్ ని తాకలేకపోయాయి. సెకండ్ మూవీ హలో అప్పటి నుండి నాగార్జున అఖిల్ మీద ఫోకస్ చేసి దర్శకుడు విక్రమ్ కుమార్ కి తగిన సూచనలు సలహాలు ఇచ్చాడనే టాక్ ఉండడం మిస్టర్ మజ్ను విషయంలోనూ వెంకీ అట్లూరితో కొన్ని సీన్స్ రీ షూట్స్ చేయించాడు నాగ్ అనే టాక్ నడిచింది. మరి నాగ్ ఎంతగా ఫోకస్ చేసిన అఖిల్ కి విజయమే దక్కడం లేదు.
తాజాగా అఖిల్ ని డిజాస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ చేతిలో పెట్టిన నాగార్జున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయంలోనూ నాగార్జున ఫోకస్ మొత్తం భాస్కర్ తీసే సీన్స్ మీదే పెట్టాడట. భాస్కర్ అసలే ప్లాప్స్ లో ఉన్నాడు. అందుకు భాస్కర్ మీద ఓ కన్నేసి ఉంచడం కాదు రెండు కెళ్ళేసి ఉంచాలని డిసైడ్ అవడం కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా షూట్ చెయ్యాలంటూ బొమ్మరిల్లు భాస్కర్ కి నాగ్ సూచిస్తున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మూడు సినిమాల ప్లాప్ నాగ్ కళ్ళముందు మెదులుతుంటే ఇప్పుడు ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద నాగార్జున ఫోకస్ మరింత ఎక్కువైంది.
అందుకే తాను నటిస్తున్న సినిమా విషయాలను కూడా పెద్దగా పట్టించుకోకుండా కొడుకు అఖిల్ విషయంలో నాగ్ మధనపడుతున్నట్లుగా తెలుస్తుంది. కొడుకుని ఎలాగైనా స్టార్ ని చెయ్యాలని అది ఈ సినిమాతోనే జరగాలని నాగ్ కలలు కంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మరి పూజా హెగ్డే గ్లామర్ అఖిల్ కి ఏమంత హెల్ప్ చేస్తుందో తెలియదు కానీ పూజా హెగ్డే మాత్రం ఈ సినిమాలో ఎప్పటిలాగే గ్లామర్ తో రెచ్చిపోతుందనే టాక్ ఉంది.