Advertisementt

ఈ ఇద్దరిలో బి‌గ్‌బాస్-4 హోస్ట్‌ ఎవరో!?

Sun 15th Mar 2020 02:43 PM
nagarjuna,mahesh babu,bigg boss 4,telugu,host,maa  ఈ ఇద్దరిలో బి‌గ్‌బాస్-4 హోస్ట్‌ ఎవరో!?
Who Is Telugu Bigg Boss-4 Host! ఈ ఇద్దరిలో బి‌గ్‌బాస్-4 హోస్ట్‌ ఎవరో!?
Advertisement
Ads by CJ

తెలుగులో బిగ్‌బాస్ 1,2,3 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్.. టూకు నేచురల్ స్టార్ నానీ.. త్రీకి అక్కినేని నాగార్జున హోస్ట్‌లు వ్యవహరించిన విషయం విధితమే. ఈ మూడు సీజన్‌లు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. మరీ ముఖ్యంగా మూడో సీజన్ మాత్రం ముందుగా అంత పస లేకున్నప్పటికీ ఆ గ్యాప్‌ను మొత్తం పూడ్చిన నాగ్.. విజయవంతంగా నడిపించాడు. అయితే.. ఇంకా సీజన్‌ పూర్తి కాకమునుపే బిగ్‌బాస్-4కు హోస్ట్‌గా ఎవరు చేస్తున్నారనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మీడియా, వెబ్‌సైట్స్, సోషల్ మీడియాలో దీనిపై కథనాలు వచ్చేస్తున్నాయ్.

ఈ క్రమంలో ఇద్దర్ని సదరు షో యాజమాన్యం ఫైనల్ చేసిందని.. వారిలో ఎవరు ఓకే అన్నా.. ఏ మాత్రం ఆలోచించకుండా తీసుకోవాలని భావిస్తున్నారట. అయితే.. వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేశ్ బాబు కాగా.. మరొకరు కింగ్ నాగార్జున అట. కాగా సామాన్యమైన సినిమాలకే ఒప్పుకోని మహేశ్‌ను ఈ షో కోసం ఒప్పించాలంటే తలప్రాణం కచ్చితంగా తోకకొస్తుంది. అలాంటిది మహేశ్‌ను నిర్వాహకులు ఎలా ఒప్పిస్తారనేది కూడా సందేహం. అయితే పారితోషికం విషయంలో యాజమాన్యం అస్సలు ఆలోచించదన్న సంగతి తెలిసిందే.

ఒకవేళ మహేశ్ ఒప్పుకోకుంటే సరే లేకుంటే.. యథావిథిగా అక్కినేని నాగ్‌నే తీసుకోవాలనే యోచన కూడా ఉందట. అయితే వీరిద్దరి కంటే ముందు జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా కబురు వెళ్లిందట. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’.. తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు.. సో.. బుడ్డోడు తెగ బిజీగా ఉంటాడు గనుక. దాదాపు నాగే ఫిక్సయిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే ఫైనల్‌గా షో యాజమాన్యం ఎవర్ని తీసుకుంటుందో..? ఎవరికి షాకిస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

Who Is Telugu Bigg Boss-4 Host!:

Nagarjuna and Mahesh Babu names in Bigg Boss 4 Host list

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ