టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. ఎందుకంటే ఆమె సినిమాల విషయం కంటే.. వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. అందుకే సినిమాల పరంగా ఆమె గురించి చెప్పుకోవడానికేమీ లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. అసలు ఎవరి మీద ఎప్పుడు ఏ పోస్ట్ చేస్తుందో..? పాత విషయాలు గుర్తుకుతెచ్చుకుని ఎవర్ని టార్గెట్ చేస్తుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా ఇప్పటికే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశించి పలుమార్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసింది.
అయితే.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. ఇది ఎవర్ని ఉద్దేశించి తెలియట్లేదు కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తట్టుకున్నట్లుగా పూనమ్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘డబ్బు హోదా ఉన్నవాడు రాజు అవ్వొచ్చు కానీ.. ప్రేమ త్యాగం న్యాయం కోసం పోరాడే వ్యక్తి వీరుడవుతాడు. రాజుని శాసిస్తాడు. వీరులు మిమ్ములను కాపాడుతారు.. శాసించాలి అని తపన పడే మనిషిలో అహంకారం ఉంటుంది. అందరూ బాగుండాలనుకునే వ్యక్తులతో ప్రేమ వైరాగ్యం ఉంటుంది’ అని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
ఈ ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి చేసిందనేది మాత్రం తెలియరాలేదు కానీ.. ‘పీకే లవ్స్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఎవర్ని ఉద్దేశించి చేసిందో తెలిసిపోయింది. అయితే ఆ డబ్బు ఉన్న వ్యక్తి ఎవరు? పోరాడే వ్యక్తి ఎవరు? రాజుని శాసించే వీరుడు ఎవరు? ఆ అహంకారి ఎవరు? అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఎవరు? అనేది మాత్రం పూనమ్‌కే ఎరుక. మనసులో దాచుకుంటే ఏమొస్తుంది పూనమ్.. బయటపడెయ్.. ఆ అహంకారి ఎవరో తేల్చిచెప్పేయ్..!