మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు టాటా చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటిస్తున్న అన్ని చిత్రాలకు దాదాపు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణే నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అలాగని తన సినిమాలేమీ పక్కనెట్టలేదు.. అటు నిర్మాతగా.. ఇటు హీరోగా విజయవంతంగా రాణిస్తున్నాడు. అయితే అన్నీ సరే.. ఈ మధ్య మరీ దూకుడు పెంచేసి మరీ.. చెర్రీ అతి చేసేస్తున్నాడట. అదేంటి.. కొంపదీసి కోట్లు కరిగిస్తున్నాడా..? అని ఆశ్చర్యపోతున్నారా..? అదేం కాదండోయ్.. ఇంతకీ అసలు విషయమేంటి..? ఎందుకు చెర్రీకి చిరు క్లాస్ పీకాడనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.
అసలు విషయానికొస్తే.. కొరటాల-చిరు మూవీ రన్నింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చిరు తదుపరి సినిమా ఫలానా డైరెక్టర్‌తో ఉంటుందని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అంతేకాదు.. కొందరైతే ఏకంగా ‘ఆచార్య’ సూటింగ్ సెట్స్‌కు వెళ్లి మరీ కథ వినిపించారట. అయితే.. చిరు మాత్రం ప్రస్తుతానికి ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. సుకుమార్‌తోనే చిరు తదుపరి సినిమా అని కూడా వార్తలు వెలువడుతున్నాయ్. ఇలా చిరు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో సదరు దర్శకులు రూట్ మార్చేసి చెర్రీని సంప్రదిస్తున్నారట.
అయితే.. ఇప్పటికే సుకుమార్ తనకు ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్టివ్వడంతో.. ఆయన చెర్రీని సంప్రదించేసరికి కాదనలేకపోయారట. మరోవైపు వి.వి వినాయక్ కూడా సంప్రదించారట. ఆయనకూ కచ్చితంగా చేద్దాం సార్ అని చెర్రీ చెప్పాడట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. చిరు-త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తోందని కూడా తాజాగా టాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. మరోవైపు.. ‘లూసీఫర్’ సినిమా కూడా రీమేక్ చేస్తారనే వినిపిస్తోంది. ఇలా తనను సంప్రదించిన వారందరికీ తెగేసి చెప్పలేక చూద్దాం అని చెర్రీ చెప్పడం.. ఇంకొందరికీ కచ్చితంగా అని చెప్పడంతో చిరుకు పిచ్చ కోపం వచ్చిందట. అసలేంటిది..? మరీ ఇంత దూకుడు అవసరమా..? కాస్త ఆలోచించు..? మనం మాటిచ్చేస్తే వాళ్లు వెయిటింగ్‌లో ఉంటారు కదా..? ఇలా చేయకు చెర్రీ.. అని కూర్చొబెట్టి చిరు క్లాస్ పీకాడట. ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.