కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్-02’. ఈ సినిమాపై వన్ కంటే ఎక్కువగానే అంచాలున్నాయ్. మరోసారి పక్కాగా బ్లాక్ బస్టర్ కొడతాడని.. ‘బాహుబలి’ని రికార్డ్‌ను కూడా బద్ధలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వార్తలు వినిపిస్తున్నాయ్. తాజాగా.. అక్టోబర్-23న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దసరా సెలవులు టార్గెట్‌గా చేసుకుని కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతోంది. ఇప్పటి వరకూ ఇటు తెలుగులో కానీ.. అటు తమిళ్‌లో కానీ అక్టోబర్‌లో సినిమాలు రిలీజ్ చేసే ఆలోచన చేయట్లేదని.. దీంతో యష్‌ను కొట్టే సినిమా ఆ నెలలో రిలీజ్ కాదని చిత్రబృందం సంబరపడిపోయింది. అయితే సరిగ్గా ఇక్కడే సూపర్ స్టార్ రజనీకాంత్ దెబ్బ కొట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
రజనీ హీరోగా దర్శకుడు శివ ‘అన్నాత్తే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ సగంకు పైగా అయిపోయిందని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్-23 లేదా అంతకంటే ముందే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. రజనీ ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేసి చాలా రోజులే అయ్యింది. అందుకే ఈ ‘అన్నాత్తే’లో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను శివ పండించారట. అంతేకాదు యాక్షన్‌కు కూడా ఏ మాత్రం కొదువ ఉండదట. ఈ చిత్రాన్ని తమిళ్‌తో పాటు తెలుగులో కూడా అక్టోబర్‌లోనే రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.
ఇంత వరకూ అధికారికంగా రజనీ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో ఇదే రోజున వస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. అడ్డు లేదనకున్న యష్‌ను రజనీ ఢీ కొట్టబోతున్నాడన్న మాట. మరి ఎవరు ఎవర్ని ఢీ కొడతారో..? దసరా బుల్లోడెవరు..? పాన్ ఇండియా చిత్రాన్ని రజనీ కొట్టగలడా..? లేకుంటే పోటీ నుంచి తప్పుకుంటాడా..? అనేది తెలియాలంటే ‘అన్నాత్తే’ దర్శకనిర్మాతలు అధికారిక ప్రకటన చేసేంతవరకూ వేచి చూడక తప్పదు.