స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రన్నింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒకట్రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. షూటింగ్‌పై కరోనా ప్రభావం పడటంతో ప్రస్తుతానికి గ్యాప్ తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ సుక్కు కథ ఇలా ఉండబోతోంది..? అలా ఉండబోతోంది..? ఇదిగో బన్నీ పాత్ర ఇలా ఉంటుంది..? అని అంతేకాదు యాంకర్ అనసూయ.. విజయ్ సేతుపతి పాత్రలకు సంబంధించి కూడా పుకార్లు షికార్లు చేశాయ్. తాజాగా.. బన్నీ మాస్‌లుక్ చిత్రబృందానికి తెలియకుండానే రివీల్ అయిపోయింది.
పర్సనల్ బాడీగార్డ్ పుట్టిన రోజు కావడంతో ఈ వేడుకల్లో బన్నీ పాల్గొన్నాడు. అలా అనుకోకుండా ఈ వేడుకకు రావడంతో లుక్ రివీల్ అయిపోయింది. బాగా పెరిగిన జుట్టు, గడ్డంతో బన్నీ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊరమాస్‌గా పాత్ర ఉంటుందట. ‘అల వైకుంఠపురములో..’ సినిమాకు పూర్తి డిఫరెంట్‌గా సుక్కు చూపిస్తున్నాడన్న మాట. బన్నీ లారీ డ్రైవర్ అని.. గ్యాప్ తీసుకుని మరీ లారీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడని.. కూడా ఈ మధ్య వార్తలు వినిపించాయి. బన్నీ ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయ్. అయితే.. తాజాగా బన్నీ వచ్చిన బన్నీ లుక్స్‌ను చూసి ఫ్యాన్స్ అంతా అంతా ఆశ్చర్యపోయారట.