మాస్ మహారాజ్ రవితేజ వరుస వైఫల్యాలతో అయోమయంలో ఉన్నాడు. చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న వచ్చిన డిస్కోరాజా చిత్రం కూడా ఫెయిల్ అవడంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కోరాజా చిత్రం ఏడు రోజులు కూడా ఆడకుండానే వెళ్ళిపోయింది. దాంతో రవితేజ మార్కెట్ ఒక్కసారిగా బాగా పడిపోయింది. అందువల్ల నిర్మాతలు రవితేజతో సినిమా చేయడానికి జంకుతున్నారట.
మార్కెట్ పడిపోవడంతో రవితేజ రెమ్యునరేషన్ ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారట. పరిస్థితిని అర్థం చేసుకున్న రవితేజ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాని అడుగుతున్నాడట. దీని ప్రకారం సినిమా విడుదల అయ్యాక లాభాలు వస్తేనే రవితేజకి అందులో షేర్ దక్కుతుంది. బాలీవుడ్ అక్షయ్ కుమార్ ఇలాంటి తరహా విధానమే పాటిస్తున్నాడు. రెమ్యునరేషన్ గొడవ లేకుండా లాభాల్లో వాటా తీసుకోవడం ద్వారా సినిమా హిట్ అయితే రెమ్యునరేషన్ కంటే ఎక్కువ లాభం పొందవచ్చు కూడా. ఫ్లాప్ అయితే నష్టం కుడా భరించాల్సిందే అనుకోండి. ఏదేమైతేనేం రవితేజతో సినిమా అంటే భయపడే నిర్మాతలు ఈ వాటాల పద్దతి నచ్చి ముందుకు వస్తున్నారట.