చిరు - కొరటాల సినిమా నుండి త్రిష తప్పుకోవడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కొరటాల సినిమాల్లో హీరోయిన్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ త్రిష మాత్రం క్రియేటివ్ డిఫ్రెన్సెస్ వల్ల చిరు సినిమా నుండి తప్పుకుంటున్నా అంటుంది. అయితే కొరటాల బృందం మాత్రం త్రిష విషయం ఎక్కడా స్పందించడం లేదు కానీ తాజాగా ఈ సినిమాలో గెస్ట్ రోల్ కింద మహేష్ ని అనుకుంటున్నారని న్యూస్ నడిచింది. తాజాగా మహేష్ కూడా చిరు సినిమాలో నటించడం లేదని ఆ పాత్రకి రామ్ చరణే నటిస్తాడని అంటున్నారు.
కారణం మహేష్ 30 నిమిషాలకి 30 కోట్లు అడిగడాన్ని.. అంత రెమ్యూనరేషన్ వెస్ట్ అనుకుంటున్నారట చిరు అండ్ చరణ్. మహేష్ ఈ మూవీలో అతిధి పాత్ర చేస్తే సినిమాకొచ్చే క్రేజ్ మాములుగా ఉండదు. కానీ ఎక్కడైనా తేడా కొడితే అనవసరంగా 30 కోట్లు లాస్. అందుకే మహేష్ ఎందుకులే ఆ పాత్ర చరణ్ చేసిన భీభత్సమైన క్రేజ్ వస్తుంది. చరణ్ తోనే సరిపెడదామని చిరు కూడా ఈ విషయంలో చరణ్ కే మొగ్గు చూపుతున్నాడట. ఎలాగూ RRR తరవాత మన సినిమా ఆచార్య విడుదల ఉంటుంది కాబట్టి ఈలోపు చరణ్ ఆచార్య కోసం ఓ నెల డేట్స్ ఇస్తే చాలని చిరు, చరణ్ ని కన్విన్స్ చేసాడట. మనం మహేష్ ని తట్టుకోలేం ఆయన క్రేజ్ అలాంటిది. సో లైట్ తీసుకుని నువ్వే చేస్తే బావుంటుంది అని చెప్పాడట చిరు చరణ్ తో.