Advertisementt

అనుష్క సొంత కుటుంబం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది?

Sat 14th Mar 2020 09:17 PM
anushka shetty,heroine,marriage,waiting,fans,everyone  అనుష్క సొంత కుటుంబం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది?
Everyone waiting for Anushka Marriage అనుష్క సొంత కుటుంబం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది?
Advertisement
Ads by CJ

2005లో వ‌చ్చిన నాగార్జున సినిమా ‘సూప‌ర్‌’తో కెరీర్ మొద‌లుపెట్టి ఈ ఏడాదితో 15 సంవ‌త్స‌రాల కెరీర్‌ను పూర్తి చేసుకుంది స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క‌. ఏ హీరోయిన్‌కి అయినా 15 సంవ‌త్స‌రాల కెరీర్ అంటే సుదీర్ఘ కాల‌మే అని చెప్పాలి. అతి త‌క్కువ మందే ఇన్నేళ్ల పాటు హీరోయిన్‌గా రాణించ‌గ‌లుగుతారు. పైగా అనుష్క మామూలు హీరోయిన్ కాదు, సూప‌ర్ హీరోయిన్‌. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి, దేవ‌సేన పాత్ర‌ల్లో మ‌రొక‌ర్ని ఊహించుకోవడానికి కూడా మ‌న‌కు మ‌న‌సొప్ప‌దు. అంత‌గా త‌న న‌ట‌నా విన్యాసాల‌తో ఆ పాత్ర‌ల‌కు ప్రాణంపోసి, తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసింది అనుష్క‌. ఆమె లేటెస్ట్ ఫిల్మ్ ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

కాగా కొద్ది రోజులుగా అనుష్క పెళ్లి గురించిన ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌టం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. నిన్న‌టి వరకు ప్ర‌భాస్‌తో డేటింగ్ చేస్తోంద‌నీ, త్వ‌ర‌లోనే ఆ ఇద్ద‌రూ పెళ్లాడ‌తార‌నీ అదే ప‌నిగా ప్ర‌చారం అవ‌డం చూశాం. అది ఉత్తుత్తి ప్ర‌చార‌మేన‌ని దాదాపు తేలిపోవ‌డంతో, ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కుమారుడు, ‘సైజ్ జీరో’ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ కోవెల‌మూడితో ఆమె పెళ్లి జ‌ర‌గ‌నున్న‌దంటూ స‌రికొత్త ప్ర‌చారం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ అనుష్క కానీ, ప్ర‌కాష్ కానీ దానిపై స్పందించ‌లేదు. గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన అనుష్క 15 ఇయ‌ర్స్‌ కెరీర్ సెల‌బ్రేష‌న్స్ ఈవెంట్‌లో రాఘ‌వేంద్ర‌రావు పాల్గొని అనుష్క గురించి ఎంతో ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడారు. త‌న‌కూ, అనుష్క‌కూ మ‌ధ్య పోలిక కూడా ఆయ‌న చెప్పారు.

అయితే ఈ ఈవెంట్‌లోనూ అనుష్క పెళ్లి ఒక టాపిక్‌గా మారడం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ‘‘అనుష్కా నీ పెళ్లెప్ప‌డు?’’ అని చార్మి డైరెక్ట్‌గా ఆమెనే అడిగేసింది. దానికి ‘‘నాకు తెలియ‌దు. జ‌రిగిన‌ప్పుడు అంద‌రికీ తెలుస్తుంది’’ అని చ‌మ‌త్క‌రించింది అనుష్క‌. అదే ఈవెంట్‌లో పాల్గొన్న ఇద్ద‌రు వ్య‌క్తులు అనుష్క పెళ్లి చేసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్న‌ట్లు మాట్లాడారు. అనుష్క‌ను ‘అరుంధ‌తి’గా చూపించి, ఆమెను స్టార్‌ను చేసిన ప్రొడ్యూస‌ర్ ఎం. శ్యామ్‌ప్ర‌సాద్ రెడ్డి, ‘‘అనుష్క‌ త‌న సొంత‌ కుటుంబాన్ని మొద‌లు పెట్టాల‌ని కోరుకుంటున్నా’’ అంటే, ‘ఒక్క మ‌గాడు’ చిత్రంలో అనుష్క‌ను డైరెక్ట్ చేసిన వైవీఎస్ చౌద‌రి, ‘‘ఆమెకు మంచి లైఫ్ పార్ట‌న‌ర్‌ దొర‌కాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పారు.  ఇప్పుడు అనుష్క వ‌య‌సెంతో తెలుసా? 38 సంవ‌త్స‌రాలు! ఈ వ‌య‌సులోనూ హీరోయిన్‌గా రాణించ‌డం గ‌తంలో టాలీవుడ్‌లో ఏ న‌టికీ సాధ్యం కాలేదు. ఆమె పెళ్లాడ‌టానికి ఇదే  స‌రైన స‌మ‌య‌మ‌ని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఆమె త‌న సొంత కుటుంబాన్ని ఎప్పుడు మొద‌లు పెడుతుందో, ఆమెకు లైఫ్ పార్ట‌న‌ర్‌గా ఎవ‌రు వ‌స్తారో.. చూద్దాం.

Everyone waiting for Anushka Marriage:

Is Anushka Shetty getting Married Soon?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ