Advertisementt

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ!

Sat 14th Mar 2020 09:09 PM
krack ravi teja new movie,ravi teja,shruti haasan,varalaxmi sarathkumar,krack movie news,krack movie stills,krack update,krack  రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ!
Ravi Teja in Rajahmundry Central Jail! రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ!
Advertisement
Ads by CJ

 

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజ రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం క్రాక్.  రవితేజతో డాన్ శ్రీను, బలుపు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన గోపీచంద్ మలినేని క్రాక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ నటిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ సెంట్రల్ జైలుకి సంభందించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఏప్రిల్ 2 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. దీంతో టాకీ పూర్తవుతుంది. ఏప్రిల్ 4నుండి జెర్మనీలో పలు అందమైన ప్రదేశాల్లో రెండు పాటలని చిత్రీకరించడానికి ప్లాన్ చేశారని తెలిసింది చిత్ర యూనిట్. ఆ తర్వాత హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఒక పాటని షూట్ చేయనున్నారు.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే 8న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో క్రాక్ చిత్రం పై అంచనాలు పెరిగాయి.  డాన్ సీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న క్రాక్ చిత్రం హ్యాట్రిక్ హిట్ అవడం ఖాయమని చిత్ర యూనిట్ లో టాక్ వినిపిస్తోంది. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రం మరి రవితేజకు ఏమేరకు బ్రేక్ నిస్తోందో  చూడాలి మరి..! 

Ravi Teja in Rajahmundry Central Jail!:

 Ravi Teja in Rajahmundry Central Jail!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ