పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయ వాక్యం లేని పేరది ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆయనకున్న ఫాలోయింగ్ క్రేజ్ మరే హీరోకి లేదనేది అతిశయోక్తి అవుతుంది. ఎప్పుడెప్పుడు ఆయన చిత్రం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆ తరుణం రానే వచ్చింది. ఒక ప్రక్క రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూనే మరో ప్రక్క సినిమాలు కమిట్ అవుతూ.. అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి పవన్ కళ్యాణ్ యమ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తోన్న వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. మరో పక్క క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం మార్చి 4 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లో కొన్ని యాక్షన్ ఎపిసొడ్స్ చిత్రీకరించారని తెలిసింది. ఆన్ లైన్ గేమింగ్ నేపథ్యంలో రేస్ కోర్స్ సన్నివేశాల్ని క్రిష్ సరికొత్తగా డిజైన్ చేసారని చిత్ర యూనిట్ లో వినికిడి. పీరియాడికల్ బ్యాక్డ్రాప్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఇంతకుముందెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారని.. లుక్ పరంగా, గెటప్ వైజ్, స్టైలిష్ గా పవన్ని చూపించబోతున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్..!!