వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా పరిచయమైన హీరో విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో వెలుగులోకి వచ్చాడు. ఈ నగరానికి ఏమైంది తర్వాత విశ్వక్ సేన్ తానే దర్శకుడిగా మారి మళయాల చిత్రమైన అంగమలై డైరీస్ చిత్రాన్ని తెలుగులో ఫలక్ నుమా దాస్ గా రీమేక్ చేశాడు. ఈ చిత్రం థియేటర్ల వద్ద ఫర్వాలేదనిపించింది. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ వల్ల ఈ చిత్రంలో ఏదో ఉందని ఊహించి ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళారు. చిన్న చిత్రం, తక్కువ బడ్జెట్ కావడంతో ఫలక్ నుమా దాస్ ఈజీగానే గట్టెక్కింది.
ఫలక్ నుమా దాస్ టైం ప్రమోషన్లలో తన మాటలు, చేతల ద్వారా యూత్ లో ఒకరకమైన క్రేజ్ అయితే సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు ఆ క్రేజ్ తోనే విశ్వక్ నూతన చిత్రమైన హిట్ సినిమాకి మినిమమ్ వసూళ్ళు సంపాదించుకున్నాడు. సాధారణంగా ఏ హీరోకైనా వరుసగా రెండు హిట్లు పడితే అతని రేటు పెంచేస్తాడు. విశ్వక్ ప్రస్తుతం అదే చేశాడు. హిట్ ఇచ్చిన ఊపుతో తన పారితోషికాన్ని పెంచేశాడు. ఇంతకు ముందు కోటి కంటే తక్కువ ఉండే తన రెమ్యునరేషన్ ని కోటి వరకి పెంచేసాడట. సినిమా సినిమాకి తన క్రేజ్ ని పెంచుకుంటూ పోతున్న విశ్వక్ పెంచడంలో తప్పేమీ లేదని అంటున్నారు.