Advertisementt

సాయిపల్లవి పాత్రపై చైతూ ఎలా రియాక్ట్ అవుతాడో?

Sat 14th Mar 2020 03:36 PM
sai pallavi,love story,naga chaitanya,dominates,sekhar kammula  సాయిపల్లవి పాత్రపై చైతూ ఎలా రియాక్ట్ అవుతాడో?
Sai Pallavi Dominates Chaitu in Sekhar Kammula Love Story సాయిపల్లవి పాత్రపై చైతూ ఎలా రియాక్ట్ అవుతాడో?
Advertisement
Ads by CJ

సాయి పల్లవి నటించే సినిమాల్లో తన పాత్ర బావుండాలని.. హీరోని డామినేట్ చేసే పాత్ర కావాలని, అలాగే గ్లామర్ పాత్రలకు నో, లిప్ లాక్ లకు నో అంటూ తెగ కండిషన్స్ పెడుతుంది అనే టాక్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. నిజంగానే గ్లామర్ పాత్రలకు సాయి పల్లవి నో, అలాగే లిప్ లాక్స్ కి నో. కాకపోతే మరీ హీరోని డామినేట్ చేసే కేరెక్టర్స్ అంటే కష్టమే. హీరోల పాత్రల మీద డామినేట్ చేసే సినిమాల్లోనే ఎక్కువగా నటించిన సాయి పల్లవికి, హీరోలతో సమానమైన రోల్స్ ఉన్న సినిమాల్లోనూ నటించింది. అయితే ఎప్పుడూ ఎల్లప్పుడూ అవే రోల్స్ అంటే కష్టం. కానీ సాయి పల్లవికి ఎక్కువగా అవే రోల్స్ వస్తున్నాయ్. లేదంటే సినిమాలే రిజెక్ట్ చేస్తుంది.

ఫిదా, కణం తాజాగా విరాట పర్వం ఇలా సాయి పల్లవి కేరెక్టర్స్ అన్ని హీరోని డామినేట్ చేసేవే. తాజాగా నాగ చైతన్య - సాయి పల్లవి కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్యూట్ లవ్ స్టోరిలోను సాయి పల్లవి కేరెక్టర్ చైతూ కేరెక్టర్ ని డామినేట్ చేస్తుందట. ఫిదా హిట్‌తో శేఖర్ మీద, సాయి పల్లవి  - చైతూల మీదున్న క్రేజ్ తో లవ్ స్టోరీపై అంచనాలు బరాబర్ ఉన్నాయి. అయితే ఈ సినిమా చూసొచ్చిన ప్రతి ప్రేక్షకుడు చైతు కేరెక్టర్ కన్నా ఎక్కువగా సాయి పల్లవి కేరెక్టర్ గురించే మాట్లాడుకుంటారని.. శేఖర్ ఖమ్ముల లవ్ స్టోరీ ని కూడా హీరోయిన్ డామినేషన్ తోనే రాసుకున్నాడనే టాక్ వినబడుతుంది. అప్పట్లో సాయి పల్లవి డామినేషన్ కి వరుణ్ తేజ్ సర్దుకుపోయినా.. కణం సినిమా విషయంలో నాగ శౌర్య, సాయి పల్లవి మీద ఫైర్ అయ్యాడు. సో లవ్ స్టోరీ విడుదల తర్వాత చైతు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Sai Pallavi Dominates Chaitu in Sekhar Kammula Love Story:

Latest Update about Sekhar Kammula Love Story Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ