Advertisementt

త్రిష పోతేనేం.. ఆ భామ ఉందిగా..!!

Sat 14th Mar 2020 03:24 PM
trisha,chiru 152,kajal agarwal,chance,heroine,koratala siva,acharya  త్రిష పోతేనేం.. ఆ భామ ఉందిగా..!!
Kajal Replaces Trisha for Chiru 152 Movie త్రిష పోతేనేం.. ఆ భామ ఉందిగా..!!
Advertisement
Ads by CJ

నిన్న ఉదయం నుండి చిరంజీవి - కొరటాల ఆచార్య మూవీ నుండి త్రిష వాకౌట్ చేసినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో రావడం.. తన కేరెక్టర్ మరీ ఆంటీలా ఉందని.. తనకి చెప్పింది ఒకటి..సినిమాలో తీసేస్తుంది ఒకటి అని త్రిష అలిగి చిరు సినిమా నుండి తప్పుకున్నట్లుగా ... నిన్న సాయంత్రానికి అఫీషియల్ న్యూస్ అంటూ బయటికి వచ్చింది. అసలు త్రిష హీరోయిన్ అని చిరు కానీ కొరటాల కానీ చిత్ర బృందం ఎక్కడ ప్రకటించకుండా.. గుంభనంగా ఉంది. అయినా త్రిష చిరు సినిమా షూటింగ్ లో పాల్గొంటూ.. ఉన్నట్టుండి షూటింగ్ మధ్యలోనే సినిమాని వదిలేసింది అనే టాక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష - చిరు తో రెండు సాంగ్స్ కూడా కొరటాల చిత్రీకరించారని.. కానీ కేరెక్టర్ పరంగా పాత్ర ఆంటీ లాగా పెద్ద ఏజ్ ఉన్న అమ్మాయిలా ఉండడంతో.. ఆగ్రహించిన త్రిష సినిమా నుండి తప్పుకుందట.

అయితే త్రిష చిరు సినిమా నుండి తప్పుకోవడంతో.. బెదరని చిత్ర బృందం కాజల్ ని సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కాజల్ అగర్వాల్ చిరుతో ఖైదీ నెంబర్ 150 లో నటించింది. ఆ సినిమాలో చిరు - కాజల్ జోడికి మంచి మార్కులే పడ్డాయి. అటు గ్లామర్ గాను, ఇటు కేరెక్టర్ పరంగాను కాజల్ చిరు పక్కన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. అలాగే సాంగ్స్ లోను చిరు ఏజ్ కి తగ్గట్టుగా కాజల్ గ్లామర్ గా ఆకట్టుకుంది. దానితో చిరు పక్కన కాజల్ చక్కగా సరిపోతుంది అని.. అందులోనూ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ ట్రెడిషనల్ గా సారీస్ లో అదరగొట్టడంతో.. ఏజెడ్ పాత్రకి కాజల్ అయితే చిరు సరసన బావుంటుంది అని.. ఇప్పుడు త్రిష ప్లేస్ లోకి కాజల్ ని తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

Kajal Replaces Trisha for Chiru 152 Movie:

Chiru 152: Trisha Out and Kajal In

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ