Advertisementt

ఆచార్య నుండి తప్పుకున్న త్రిష.. కన్ఫర్మ్ చేసేసింది.

Fri 13th Mar 2020 03:38 PM
trisha,megastar chiranjeevi,acharya,koratala shiva  ఆచార్య నుండి తప్పుకున్న త్రిష..  కన్ఫర్మ్ చేసేసింది.
Trisha confirmed..That she is not in Acharya ఆచార్య నుండి తప్పుకున్న త్రిష.. కన్ఫర్మ్ చేసేసింది.
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా పేరుని అధికారికంగా రివీల్ చేయకపోయినప్పటికీ ఆచార్యగా అని పెట్టినట్లు చిరంజీవి ఒకానొక ఫంక్షన్ లో నోరు జారడంతో అందరికి తెలిసిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే ఈ సినిమా మీద అనేక వార్తలు వచ్చాయి. ఇందులో మహేష్ బాబు నటిస్తున్నాడని, లేదు లేదు రామ్ చరణ్ నటిస్తున్నాడని, ఇంకోసారి ఆ పాత్రలో అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని రకరకాల వార్తలు వచ్చాయి. 

 

అయితే ఈ వార్తలన్నింటి పట్ల ఆచార్య టీం ఎలాంటి స్పందన వ్యక్తపరచలేదు. హీరోయిన్ విషయంలోనూ ఇలాంటి కన్ఫ్యూజన్నే ఆచార్య టీం మెయింటైన చేసింది. త్రిష కన్ఫర్మ్ అయిందని వార్తలు వచ్చినా అవి అధికారికంగా రాకపోవడంతో అసలు త్రిష ఆచార్య సినిమాలో ఉందా లేదా అనేది అర్థం కాకుండా అయిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ఆచార్య సినిమా నుండి తప్పుకుంది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది త్రిష. కొన్ని సార్లు కొన్ని నిర్ణయాలు అనుకున్నట్టుగా జరగవు.. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తాను ఆచార్య సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ధృవీకరించింది.  మరి ఆచార్య టీం ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి.

Trisha confirmed..That she is not in Acharya:

Trisha confirmed that she is out from Megastars movie Acharya

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ