Advertisementt

అనుష్క వేడుకలో హీరోలకు నో ఎంట్రీ!

Sat 14th Mar 2020 01:59 PM
anushka,15 years,cine carrier,event,directors,producers,no entry,heroes  అనుష్క వేడుకలో హీరోలకు నో ఎంట్రీ!
No Heroes at Anushka 15 Years Cine Carrier Event అనుష్క వేడుకలో హీరోలకు నో ఎంట్రీ!
Advertisement
Ads by CJ

అనుష్క ఎప్పుడెప్పుడు కనబడుతుంది అనే ఆశతో చాలామంది అభిమానులే ఉన్నారు. సైజు జీరో దెబ్బకి మాయమైన అనుష్క మళ్ళీ నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకూ రాబోతుంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఫేస్ లో ఉన్న క్యూట్ నెస్ తో అనుష్క స్టార్ హీరోలతో చాన్సు కొట్టేసింది. అనుష్క స్ట్రెక్సర్ కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ అనుష్క మాత్రం టాలీవుడ్ హీరోలందరి సినిమాల్లో నటించింది. అయితే సైజు జీరోతో బొద్దుగా మారిన అనుష్క మళ్ళీ మునపటి ముద్దుగుమ్మ కాలేకపోయింది. చాలా ప్రయత్నాలు చేసి బరువు తగ్గించిన అనుష్క మునుపటి గ్లో మిస్ అయ్యింది. తాజాగా జరిగిన నిశ్శబ్దం ప్రీ రిలీజ్ ఈవెంట్ కమ్ అనుష్క 15 ఇయర్స్ జర్నీలో అనుష్క చక్కగా ట్రెడిషనల్ గా తయారయింది కానీ ఫేస్ లో గ్లో కనబడలేదు.

అయితే నిశ్శబ్దం ఈవెంట్ లోనే అనుష్క 15 ఇయర్స్ జర్నీ ఈవెంట్ కూడా జరగడం దానికి అనుష్క నటించిన సినిమాల దర్శకుల్లో చాలామంది హాజరవడం జరిగింది. రాజమౌళి, పూరి, రాఘవేంద్ర రావు, శ్యాం ప్రసాద్ రెడ్డి, పివిపి ఇలా చాలామంది దర్శకనిర్మాతలు హాజరై అనుష్క 15 ఇయర్స్ జర్నీ గురించి గొప్పగా మాట్లాడారు. అనుష్క ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే ఈ ఈవెంట్ లో అనుష్కతో కలిసి నటించిన హీరోలెవరు హాజరవలేదు. అంటే కేవలం దర్శకనిర్మాతలతోనే అనుష్క సరిపెట్టేసింది కానీ హీరోలకు మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. లేదంటే ప్రభాస్, మహేష్, బాలకృష్ణ, చిరు, నాగ్ ఇలా అందరూ అనుష్క ఈవెంట్ లో వాలిపోదురు. అనుష్క పిలవలేదు కానీ పిలిస్తే ఆ ఈవెంట్ మరింత సందడిగా మారి అనుష్క గొప్పదనం మరికాస్త తెలిసేది అంటున్నారు అభిమానులు.

No Heroes at Anushka 15 Years Cine Carrier Event:

Anushka 15 Years Cine Carrier Event: only for Directors and Producers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ