Advertisementt

దసరా బరిలో ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’

Sat 14th Mar 2020 11:28 AM
actor yash,kgf chapter 2,movie,release,october 23  దసరా బరిలో ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’
KGF Chapter 2 Movie Release Date Fixed దసరా బరిలో ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’
Advertisement
Ads by CJ

ద‌స‌రా సంద‌ర్భంగా  ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 23న విడుద‌ల‌వుతున్న రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా చిత్రం ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’

సినిమా చరిత్రలో హిట్స్‌, సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రెండ్ సెట్టింగ్‌ మూవీస్‌ మాత్రం అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అరుదైన ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీస్‌లో ‘కె.జి.యఫ్‌’ ఒకటి. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ కన్నడ చిత్రసీమలో ‘కె.జి.యఫ్‌’ ట్రెండ్ సెట్టింగ్‌ మూవీగా నిలవడమే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సెన్సేషనల్ హిట్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్‌ను సాధించింది. వసూళ్లలోనే కాకుండా అవార్డుల్లోనూ ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ విజువల్‌ ఎఫెక్ట్‌, స్టంట్స్‌ విభాగాల్లో జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 

అటు అభిమానులు, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ భారీ బడ్జెట్‌తో అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌‌కి ప్రేక్షకులు, అభిమానుల నుండి అమేజింగ్‌ రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ స్టార్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ ఈ చిత్రంలో అధీర అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవ‌ల య‌ష్‌, సంజ‌య్ ద‌త్‌, ర‌వీనాటాండ‌న్ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. దీంతో మేజ‌ర్ షెడ్యూల్ పూర్త‌య్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

రాఖి భాయ్‌గా యష్ రాకింగ్‌ పెర్ఫామెన్స్ చేయనున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి రవి బస్రూర్‌ సంగీతం, భువన్‌ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

KGF Chapter 2 Movie Release Date Fixed:

KGF Chapter 2 Movie Release on Oct 23

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ