Advertisementt

బాల‌య్య‌తో.. ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న బోయ‌పాటి!

Fri 13th Mar 2020 01:51 PM
balakrishna,boyapati srinu,budget,miryala ravinder reddy,shooting  బాల‌య్య‌తో.. ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న బోయ‌పాటి!
Boyapati not Happy with Balayya movie బాల‌య్య‌తో.. ఎర‌క్క‌పోయి ఇరుక్కున్న బోయ‌పాటి!
Advertisement
Ads by CJ

బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేస్తోన్న సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు ఈమ‌ధ్యే మొద‌లైంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా చేసిన ‘విన‌య విధేయ రామ’ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ‌తో చేయ‌డానికి క‌మిట్ అయ్యాడు బోయ‌పాటి. ‘విన‌య విధేయ రామ‌’ను రూపొందించిన విధానంతో అత‌ను విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. దాంతో బాల‌కృష్ణతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి త‌నేమిటో విమ‌ర్శ‌కుల‌కు చెప్పాల‌నే క‌సితో ఈ సినిమా ఒప్పుకున్నాడు. కానీ మొద‌ట్లో ప‌రిస్థితులు అత‌నికి క‌లిసి రాలేదు. ఈ మ‌ధ్య‌లో మ‌రో సినిమా చేయ‌వ‌ద్ద‌ని అత‌ను చెప్పినా వినిపించుకోకుండా ‘రూల‌ర్’ సినిమా చేసి దారుణంగా దెబ్బ‌తిన్నాడు బాల‌య్య. ఆ సినిమాకి ముందే మార్కెట్ బాగా డౌన్ అయిపోయిన ఆయ‌న‌ను ‘రూల‌ర్’ మ‌రింత కింద‌కు దించేసింది.

ఇవాళ బాల‌య్య సినిమా అంటే బ‌య్య‌ర్లు ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌డం లేదు. బాల‌య్య మార్కెట్ ఈ రేంజిలో ప‌డిపోతుంద‌ని బోయ‌పాటి కూడా ఊహించ‌లేదు. త‌న పేరుతోనైనా ఈ సినిమాకు క్రేజ్ వ‌స్తుంద‌ని ఆశించిన అత‌డికి.. అది కూడా జ‌ర‌గ‌క‌పోవ‌డంతో షాక్ త‌గిలిన‌ట్ల‌యింది. ‘సింహా, లెజెండ్’ కాంబినేష‌న్ సినిమా కాబ‌ట్టి మంచి రేట్లు ప‌లుకుతాయ‌నుకున్న నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి అంచ‌నాలు త‌ల్ల‌కిందుల‌య్యాయి. త‌న అంచ‌నాల‌కూ, బ‌య్య‌ర్ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌కూ ఏమాత్రం పొంత‌న లేక‌పోవ‌డంతో బ‌డ్జెట్ త‌గ్గించ‌డం త‌ప్ప వేరే దారిలేద‌ని అత‌ను తేల్చిచెప్ప‌డంతో అందుకు అనుగుణంగా ప్రొడ‌క్ష‌న్‌ బ‌డ్జెట్‌ను భారీగా త‌గ్గించేశాడు బోయ‌పాటి.

‘సింహా, లెజెండ్’ షూటింగ్ సెట్స్‌లో వాతావ‌ర‌ణం చూసిన‌వాళ్లు.. ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ సెట్‌లో వాతావ‌ర‌ణం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మునుప‌టి ఉత్సాహం, ఉత్తేజం ఈ సెట్‌లో క‌నిపించ‌డం లేద‌ని చెప్పుకుంటున్నారు. బాల‌య్య ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు క‌నిపిస్తోంద‌నీ, ఇదివ‌ర‌కు స‌ర‌దాగా క‌నిపించిన ఆయ‌న ఇప్పుడు చీటికీమాటికీ రుస‌రుస‌లాడుతూ క‌నిపిస్తున్నాడ‌ని అంటున్నారు. బాల‌య్య‌, బోయ‌పాటి మ‌ధ్య కూడా గ‌తంలో మాదిరిగా సాన్నిహిత్యం ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని కూడా తెలుస్తోంది. బాల‌య్య‌తో చేయ‌డానికి ఒప్ప‌కున్నందువ‌ల్లే ఆయ‌న ఈ సినిమా చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంద‌నే మాట ఎక్కువ‌గా వినిపిస్తోంది. అందుకే ఇవాళ బోయ‌పాటి ఎర‌క్క‌పోయి ఇరుక్కున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు చెప్పుకుంటున్నారు.

Boyapati not Happy with Balayya movie:

Balakrishna and Boyapati Srinu Movie Latest update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ