Advertisementt

మార్చి 20న ‘అసలు ఏంజరిగిందంటే..’

Thu 12th Mar 2020 04:31 PM
asalem jarigindante movie,asalem jarigindante movie,mahendran,srinivas bandari,trailer release  మార్చి 20న ‘అసలు ఏంజరిగిందంటే..’
asalem jarigindante movie release date fixed మార్చి 20న ‘అసలు ఏంజరిగిందంటే..’
Advertisement
Ads by CJ

మీడియా సమక్షంలో మార్చి 20న విడుదల కాబోతున్న ‘అసలు ఏంజరిగిందంటే..’ ట్రైలర్ విడుదల. 

ఏబీఆర్ ప్రొడక్షన్స్ మరియు జిఎస్ ఫిలిమ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్న చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’. మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రదాన పాత్రదారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించగా, అనిల్ బొద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ.. ‘‘ ఈ ట్రైలర్‌ను గెస్ట్‌లు ఎవరూ లేకుండా.. మీడియా సమక్షంలో విడుదల చేయడానికి కారణం.. మొదటి నుంచి వారిస్తున్న సపోర్టే. ఇప్పటి వరకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇప్పుడు సినిమా విడుదల కాబోతోంది. మీడియా వారికి ముందుగా ఈ ట్రైలర్‌ను చూపించి, వారి జడ్జిమెంట్‌తో సినిమాని ప్రేక్షకులదగ్గరకు తీసుకువెళ్లాలనే ఈ ట్రైలర్‌ను ఇలా విడుదల చేశాము. ట్రైలర్ చూసిన అందరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ మా చిత్రయూనిట్ తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ సినిమాకి ‘అసలు ఏంజరిగిందంటే..’ అనే టైటిల్ పెట్టడానికి కారణం.. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు వారి దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇతరులకు విషయాన్ని చెప్పడానికి ఈ మాటను వాడతారు. నేను ఈ సినిమా కథను చెప్పడానికి ఈ టైటిల్‌ను పెట్టడం జరిగింది. ‘అసలు ఏంజరిగిందంటే..’ అని మొదలుపెట్టి నేను ఈ కథను చెప్పబోతున్నాను. మనిషి జీవితంలో జరిగిపోయింది తప్ప.. జరగబోయేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నవ్వుతూ ఉండేవారికి ఇంకొంచెం సేపట్లో ఏదైనా జరగవచ్చు. అదేంటనేది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి సమాధానం దేవుడే చెప్పాలి. కాలంతో పాటు పరిగెత్తడం తప్ప.. అంతకుమించి మనం ఏమీ చేయలేం. అదే ఈ సినిమాలో చెప్పదలుచుకున్నాను. 

నేను రాసుకున్న కథకి వాస్తవంగా చెప్పాలంటే పెద్ద హీరో, అనుభవం ఉన్న హీరో కావాలి. నేను కొత్తవాడిని. నాతో పెద్ద హీరో అంటే అయ్యే పని కాదు. అందుకే 150 సినిమాల్లో బాలనటుడిగా నటించిన మహేంద్రన్‌ని హీరోగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మహేంద్రన్ ఈ సినిమాలో చాలా చక్కగా చేశాడు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. చరణ్ అర్జున్ ఇచ్చిన సంగీతం అందరినీ అలరిస్తుంది. 6 పాటలున్నాయి. అన్నీ చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాలో ఎటువంటి ద్వందర్థాలు, సీన్లు ఉండవు. సెన్సార్ నుంచి సింగిల్ కట్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ షానీ సాల్మన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పోస్టర్‌ను తమిళ స్టార్ విజయ్ సేతుపతి ద్వారా, సాంగ్ థమన్ ద్వారా విడుదల చేయించాము. థ్రిల్లర్ కాన్సెప్ట్. కథకు తగ్గ యాక్టర్స్‌ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డైరెక్టర్ ఈ సినిమా తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. హీరో మహేంద్రన్‌కి మంచి సినిమా అవుతుంది. మీడియా వారందరికీ ధన్యవాదాలు. మార్చి 20న సినిమా విడుదలకానుంది. అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.’’ అన్నారు.

హీరో మహేంద్ర మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏదో ఒక స్పెషల్‌తో హీరోగా పరిచయం అవ్వాలనే ఈ కథను సెలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. రగ్డ్ క్యారెక్టర్ ఉన్న పాత్ర. చెప్పాలంటే రవితేజగారి పాత్రలా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్టుగా ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను..’’ అన్నారు.

ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ తటవర్తి, కుమనన్, తదితరులు ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్, కుమనన్, హరితేజ, షఫీ, విజయ్ కుమార్, షానీ, ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: చరణ్ అర్జున్, డిఓపి: కర్ణ ప్యారసాని, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, ఫైట్స్: వాసు, కొరియోగ్రాఫర్: ఆర్ కె(రాధాకృష్ణ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: షానీ సాల్మన్, కో డైరెక్టర్: సూర్య దొండపాటి, విఎఫ్‌ఎక్స్: రవి కొమ్ముల. నిర్మాత: అనిల్ బొద్దిరెడ్డి, పీఆర్ఓ: వీరబాబు, డైరెక్టర్: శ్రీనివాస్ బండారి.

asalem jarigindante movie release date fixed:

asalem jarigindante movie trailer released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ