Advertisementt

ఆచార్య టైటిల్ మార్చనున్నారా..?

Thu 12th Mar 2020 06:48 AM
koratala siva,chiranjeevi,discussions,acharya title  ఆచార్య టైటిల్ మార్చనున్నారా..?
Again Rumours on Chiru 152 Movie ఆచార్య టైటిల్ మార్చనున్నారా..?
Advertisement
Ads by CJ

చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా టైటిల్ విషయంలో చిరు చేసిన చిన్న తప్పిదంతో ఆ టైటిల్ గ్రాండ్ గా కాకుండా చాలా సైలెంట్ గా బయటికి వచ్చేసింది. కొరటాల - చిరు సినిమా మొదలైనప్పటి నుండే ఆచార్య టైటిల్ ప్రచారంలో ఉండడం, చిరు అనుకోకుండా రివీల్ చెయ్యడంతో కొరటాల నిర్మాత రామ్ చరణ్ షాక్ తిన్నారనే న్యూస్ నడిచింది. అయితే ఇక అదే టైటిల్ ని పెడుతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజాగా మళ్ళీ కొరటాల - రామ్ చరణ్ - చిరు ఆచార్య టైటిల్ విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే ఆచార్య అనేది కేవలం చిరుకి మాత్రమే సెట్ అవుతుంది.

కానీ ఈ సినిమాలో మరో యంగ్ హీరో(మహేష్ ఆర్ రామ్ చరణ్) కానీ నటిస్తాడనే న్యూస్ ఉంది. ఆ లెక్క ప్రకారం టైటిల్ లో ఇద్దరి పేర్లు ఉండేలా చూడాలని అనుకోవడం, ఆచార్య టైటిల్ కి అనుకున్న రెస్పాన్స్ అయితే రాలేదని మెగా ఫ్యాన్స్ మరో పవర్ ఫుల్ టైటిల్ కావాలని పట్టుబడుతున్నారని అలాగే మల్టీస్టారర్ అనుకుంటున్నారు కాబట్టి ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ అయితే బావుంటుంది అనే ఆలోచనలో కొరటాల - చిరు - చరణ్ ఉన్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. ఎలాగూ ఉగాదికి మెగాస్టార్ చిరు మూవీ లుక్ వదులుదామని టీం డిసైడ్ అయినట్లుగా న్యూస్ ఉంది. ఆ ఉగాది రోజునే టైటిల్ తో పాటుగా ఓ మోషన్ పోస్టర్ ని కూడా వదలాలని టీం సిద్దమవుతుందట. మరి ఉగాది రోజున చిరు సినిమా టైటిల్ ఆచార్య నా లేదా మరేదన్నా అనే దాని మీద క్లారిటీ రావొచ్చని అంటున్నారు.

Again Rumours on Chiru 152 Movie:

Koratala Siva and Chiranjeevi Discussions on Acharya Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ