తెలుగు బిగ్‌బాస్-3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై పబ్‌లో కొందరు దుండగులు బీరు సీసాలతో దాడిచేసి గాయపరిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారమై హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో రాహుల్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు.. మంత్రి కేటీఆర్‌కు జరిగిన గొడవ విషయం క్లారిటీగా సోషల్ మీడియా వేదికగా వివరించాడు రాహుల్. మరోవైపు విలన్ పాత్రధారుడు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్.. రాహుల్‌గా అండగా నిలిచి మద్దతిచ్చాడు. అయితే ఇండస్ట్రీ నుంచి ఈయనొక్కడు తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్టుగా రాలేదు. ఆఖరికి రాహుల్‌కు బాగా కావాల్సిన పునర్నవీ భూపాలం కూడా మద్దతివ్వలేదు.. కనీసం సింగిల్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో చేయలేదు.
కారణాలు ఇవీ..!
అసలు పున్నూ బేబీ పట్టించుకోకపోవడంతో ఇంతకీ ఈ బ్యూటీకి ఏమైంది..? ఎందుకు పట్టించుకోలేదు..? అసలు ఆమె అడ్రస్ లేకుండా పోయిందే..? ఏమైందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చే జరిగింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పునర్నవి ఎందుకు కనిపించకుండా పోయిందో ఫాలోవర్స్‌కు, అభిమానులు అర్థం కాలేదు. అయితే జరగాల్సిందంతా జరిగిపోయాక తీరిగ్గా.. ఈ గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి అనేది వివరించింది. ‘నేను కాస్త విరామం తీసుకున్నాను.. ఈ విషయం ఎవరైనా గమనించారో లేదో.. ఇలా మళ్లీ ఎప్పుడైనా చేస్తారా..? అని తనను అడిగితే కచ్చితంగా అవుననే చెబుతాను. ఎందుకంటే.. ఎంతో సంతోషాన్నిచ్చే రీల్ లైఫ్‌కు నేను దూరంగా వెళ్లిపోయాను. మానసిక ఆరోగ్యాన్ని కూడా మరిచిపోయా. ఇలా విరామం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ గ్యాప్‌లో నేను ఒక పుస్తకాన్ని చదివాను.. ఆ పుస్తకంతో పాటు నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో సమయం గడిపాను. నా అభిమానులంతా బాగున్నారని నేను భావిస్తున్నా’ అని రాసుకొచ్చింది.
రియాక్షన్ లేదేం!
ఇన్ని మాటలు మాట్లాడిన పున్నూ.. రాహుల్ గురించి అస్సలేమీ తెలియనట్లుగా ఒక్క మాటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె పోస్ట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, రాహుల్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. కాగా.. వీరిద్దరూ బిగ్‌బాస్ ఉన్నంతవరకూ.. షో అయిపోయాక ఇంటికొచ్చాక కూడా ఎన్నెన్ని రూమర్స్ వచ్చాయో.. ఎన్నెన్ని కథనాలు వచ్చేశాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరి ఇంత మంచి రిలేషన్ షిప్ ఉన్న రాహుల్‌ను పున్నూ నిజంగానే మరిచిపోయిందా లేకుంటే.. ఇండస్ట్రీ నుంచి పెద్దోళ్లు ఎవరూ రియాక్ట్ అవ్వలేదుగా.. తానొక్కదాన్నే అయితే విమర్శలు వస్తాయేమోనని మిన్నకుండిపోయిందా అనేది తెలియాల్సి ఉంది.