టైటిల్ చూడగానే ఇదేంటి.. ఎన్నికలు అయిపోయాయ్.. రెండు చోట్ల పోటీచేసిన పవన్ కల్యాణ్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయారు కదా.. పైగా ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవ్.. అని ఆలోచిస్తున్నారు కదూ.. ఎస్ మీరు వింటున్నది నిజమే కానీ.. రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో మాత్రమే. ఇంతకీ రీల్ లైఫ్‌లో అయినా ఎలా వర్కవుట్ అవుతుంది..? ఇంతకీ ఈయన్ను సీఎంగా చూపించబోయే ఆ దర్శకుడు ఎవరు..? ఇందులో నిజానిజాలెంత..? ఫ్యాన్స్ నిజంగానే ఈ వార్తను నమ్మొచ్చా..? అనేదానిపై క్లారిటీ కావాలంటే ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ ఆర్టికల్ చదివేయండి మరి.
‘వకీల్ సాబ్’ సినిమాతో టాలీవుడ్‌లోకి పవన్ రీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ కూడా అయిపోవచ్చింది. ఈ మూవీ తర్వాత క్రిష్‌తో.. ఆ తర్వాత హరీశ్ శంకర్‌తో సినిమా ఉండనుంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత పవన్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వాస్తవానికి ‘జనగణమన’ అనే కథ ఎప్పట్నుంచో పూరీ దగ్గర అలాగే ఉండిపోయింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించాలని ఆయన భావించినప్పటికీ అది జరగలేదు. అయితే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తాను సిద్ధంగా ఉన్నానని ఎప్పుడో పూరీ అనుకున్నారట. ఆ సమయం ఎట్టకేలకు ఆసన్నమైందట.
కాగా.. ఇటీవలే పవన్‌కు స్టోరీ లైన్ వినిపించగా ‘అద్భుతం పూరీ సాబ్’ అంటూ మెచ్చుకున్నారట. ఈ సినిమాలో పవన్ సీఎంగా కనిపించబోతున్నారట. అంటే రియల్‌గా కాలేకపోయినా.. రీల్ లైఫ్‌లో పవన్‌ను సీఎంగా ఫ్యాన్స్ చూడబోతున్నారన్న మాట. క్రిష్, హరీశ్ శంకరర్ తర్వాత పూరీ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. కాగా.. ఈ కాంబోలో సినిమా రావడం కొత్తేమీ కాదు ఇప్పటికే ‘బద్రి’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలు వచ్చాయి. అంటే ముచ్చటగా మూడో సినిమా రాబోతోందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.