Advertisementt

టబ్ డిమాండ్‌కు కంగుతిన్న నిర్మాతలు!

Wed 11th Mar 2020 12:38 PM
producers,shock,actress tabu,remuneration  టబ్ డిమాండ్‌కు కంగుతిన్న నిర్మాతలు!
Producers Shock Over Tabu Demand! టబ్ డిమాండ్‌కు కంగుతిన్న నిర్మాతలు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లోకి కొన్నేళ్ల తర్వాత సీనియర్ నటీమణి, ఒకప్పుడు సౌత్‌ను ఏలిన హీరోయిన్ టబు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించి మెప్పించి.. తనలో పాత ఫామ్ పోలేదని.. అలాగే ఉందని నిరూపించుకుంది. ఇక టాలీవుడ్‌లో ఆమె నటించిన తెలుగు సినిమాల గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన్మథుడు నాగార్జున, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్యతో పాటు పలువురు తెలుగు హీరోల సరసన నటించి మెప్పించి తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ సంపాదించుకుంది. అలా అప్పట్లో తెలుగు తెరకు దూరమైన ఈ సీనియర్ బ్యూటీ.. బన్నీ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమాలో టబు కీలక పాత్ర కావడం.. ఆమె నటన అద్భుతంగా ఉండటంతో డైరెక్టర్లు ఫిదా అయిపోతున్నారు.

ఇక అసలు విషయానికొస్తే.. శ్రీమంతురాలు పాత్ర లేదా కాస్త రిచ్‌గా ఉండే పాత్రలంటే డైరెక్టర్లకు మొదట టబు మీదే ఆలోచనపోతోందట. ఆ ముదురు భామ అయితేనే న్యాయం చేస్తుందని దర్శకనిర్మాతలు బాగా నమ్ముతున్నారట. అయితే తాజాగా.. తాజాగా ఓ ప్రముఖ నిర్మాత తమ సినిమాలో నటించాలంటూ టబు మేనేజర్‌ను సంప్రదించారట. కోటి రూపాయిలయితే ఓకే లేదంటే ఫోన్ చేయనక్కర్లేదని తెగేసి చెప్పాడట. మేడమ్‌తో మేం మాట్లాడతాం.. ఒకసారి ఫోన్ ఇవ్వండి అని నాలుగైదుసార్లు బతిమలాడగా ఎస్.. మా మేనేజర్ మాటే తన మాట అంటూ చెప్పేసిందట.

అంటే.. ఇంచు మించు ఓ మాదిరి హీరోయిన్ రెమ్యునరేషన్ టబు డిమాండ్ చేస్తోందన్న మాట. ముదరుభామ మాటలకు సదరు కాల్ చేసి మాట్లాడిన నిర్మాత కంగుతిన్నారట. ఈ క్రమంలో ఇక టబు మీద ఆశలు వదిలేసి నదియాతో పాటు ఓ మాదిరి ఆర్టిస్టులను వెతికే పనిలో నిర్మాత ఉన్నారట. ఇలా డిమాండ్ చేస్తే అవకాశాలు ఏ మాత్రం వస్తాయో ఏంటో.. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది. 

Producers Shock Over Tabu Demand!:

Producers Shock Over Tabu Demand!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ