Advertisementt

బ‌న్నీ సినిమాలో ఆ సీన్లు ఉండ‌వా?

Wed 11th Mar 2020 01:58 AM
sukumar,allu arjun,movie,latest,update  బ‌న్నీ సినిమాలో ఆ సీన్లు ఉండ‌వా?
Trail shoot Completed for Bunny and Sukku Movie బ‌న్నీ సినిమాలో ఆ సీన్లు ఉండ‌వా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తోన్న ఇంకా పేరు పెట్ట‌ని సినిమా రెండో షెడ్యూల్ న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో మొద‌ల‌వ‌బోతోంది. ఇదివ‌ర‌కు జ‌న‌వ‌రిలో బ‌న్నీ లేకుండానే కేర‌ళ‌లో జ‌రిపిన షెడ్యూల్‌లో కొన్ని స‌న్నివేశాలు తీశాడు సుకుమార్‌. ఫిబ్ర‌వ‌రిలో రెండో షెడ్యూల్‌ను బ‌న్నీతో మొద‌లు పెట్టాల్సి ఉండ‌గా, అది మార్చికి పోస్ట్‌పోన్ అయ్యింది. క‌థ ప్ర‌కారం లారీ డ్రైవ‌ర్ అయిన‌ హీరో చిత్తూరు యాస‌లో మాట్లాడతాడు. అందుక‌ని ఆ యాస‌లో ప‌ట్టు సాధించ‌డం కోసం ఫిబ్ర‌వ‌రి అంతా ఆ యాస‌ను ప్రాక్టీస్ చేస్తూ వ‌చ్చాడు బ‌న్నీ. ఇప్పుడు సుకుమార్ ఎప్పుడు త‌న సీన్స్ స్టార్ట్ చేసినా ఎఫెక్టివ్‌గా చేయ‌డానికి ఆయ‌న రెడీగా ఉన్నాడు.

కాగా కేర‌ళ‌లో చిత్రీక‌రించిన స‌న్నివేశాల‌నే న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో సుకుమార్ తీయ‌నున్నాడ‌నే ప్ర‌చారం ఫిల్మ్‌న‌గ‌ర్‌లో న‌డుస్తోంది. కేర‌ళ‌లో తీసిన‌దంతా ట్రయ‌ల్ షూట్ అనీ, అక్క‌డ తీసిన సీన్లు ఏవీ సినిమాలో ఉప‌యోగించ‌ర‌నీ అంటున్నారు. ఈ విష‌యం ముందుగానే నిర్మాత‌లైన మైత్రీ మూవీ మేక‌ర్స్‌కు సుకుమార్ తెలియ‌జేశాడ‌నీ, దాని కోసం అద‌నంగా బ‌డ్జెట్ కేటాయించ‌డానికి వారూ ఓకే చెప్పార‌నీ వినిపిస్తోంది. ఇటీవ‌లి కాలంలో ఒక తెలుగు సినిమా కోసం ట్ర‌య‌ల్ షూట్ నిర్వ‌హించ‌డమ‌నేది ఈ సినిమాకే వింటున్నాం.

బ‌న్నీ జోడీగా తొలిసారి ర‌ష్మికా మంద‌న్న న‌టిస్తోన్న ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి ఒక కీల‌క పాత్ర చేస్తున్నాడు. ఇందులో ఆయ‌న బన్నీని చేజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించే పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. బ‌న్నీ, విజ‌య్ సేతుప‌తి మ‌ధ్య చేజింగ్ సీన్లు ఈ సినిమాలోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల్లో ఒక‌టిగా ఉండ‌బోతున్నాయి. సుకుమార్ మునుప‌టి చిత్రం రంగ‌స్థ‌లంలో విల‌న్‌గా అద‌ర‌గొట్టిన జ‌గ‌ప‌తిబాబు ఈ చిత్రంలోనూ అదే త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ‌తో రూపొందుతోన్న‌ ఈ సినిమాని అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ఆశిస్తున్నారు.

Trail shoot Completed for Bunny and Sukku Movie:

Sukumar and Allu Arjun Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ