ఏ భాషలో అయినా హీరోలు ఏళ్లకు తరబడి అంటే 60 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా హీరోలకిందే కొనసాగుతారు. హీరోలకు వయసుతో ఏ పనీ లేదు. క్రేజ్ ఫాలోయింగ్ ఉంటే చాలు. కొంతమంది అభిమానులైతే తమ హీరో వయసుతో పనిలేదు. ఇంకా హీరోగా నటించాలనే కోరుకుంటారు. అందుకే చిరు, మోహన్ లాల్, బాలకృష్ణ, నాగ్, వెంకీ, రజినీకాంత్ లాంటోళ్ళు ఇప్పటికి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే అంతలా హీరోలకుండే ఫాలోయింగ్ అట్రాక్షన్స్ హీరోయిన్స్ కి ఉండదు అంటుంది అక్కినేని కోడలు సమంత. పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత ఈ మధ్యన సినిమాలు చెయ్యడం తగ్గించింది.
అయితే సమంతని ఒకరు హీరోల వలె హీరోయిన్స్ ఎందుకు భిన్నమైన రోల్స్ చెయ్యరు అని అడగగా... దానికి సమంత చాలా తెలివిగా కాదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడింది. అదేమంటే స్టార్ హీరోలకుండే ఫాలోయింగ్ అట్రాక్షన్ లో హీరోయిన్స్ కి ఒక శాతం కూడా ఉండదు. అలాగే హీరోల వలె హీరోయిన్స్ కి సోలోగా అంటే లేడి ఓరియెంటెడ్ హిట్స్ రావడం చాలా కష్టం. హీరోయిన్ ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడినా రాని పేరు ప్రఖ్యాతలు హీరో గారు అలా స్క్రీన్ మీద నడుచుకుంటూ వెళ్లి రెండు స్టెప్స్ వేస్తే వచ్చేస్తుంది. కానీ హీరోయిన్స్ భిన్నమైన రోల్స్ చేస్తుంటే ఒక్క ప్లాప్ పడినా వారి కెరీర్ ముగిసిపోతుంది. అందుకే హీరోయిన్స్ కాస్త రిస్క్ ఉన్న కేరెక్టర్స్ కి భయపడతారంటూ హీరోలకు, హీరోయిన్స్ కి ఎంత వ్యత్యాసముందో చెప్పింది.