Advertisementt

మార్చి 11న ‘లవ్ స్టోరీ’ నుంచి స్పెషల్ ఇదే!

Tue 10th Mar 2020 09:35 PM
naga chaitanya,sai pallavi,love story,movie,ay pilla song,release,march 11  మార్చి 11న ‘లవ్ స్టోరీ’ నుంచి స్పెషల్ ఇదే!
Love Story Movie Ay Pilla Full Song Release Details మార్చి 11న ‘లవ్ స్టోరీ’ నుంచి స్పెషల్ ఇదే!
Advertisement
Ads by CJ

లవ్ స్టోరీ టీం నుండి హోలీ శుభాకాంక్షలు. మార్చి 11, బుధవారం నాడు మొదటి సాంగ్ ‘ఏయ్ పిల్లా’ విడుదల

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ  ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్  క్రియేషన్స్, సోనాలి నారంగ్  సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

మ్యూజికల్ లవ్ స్టోరీగా రాబోతున్న లవ్ స్టోరీ నుండి ఇటీవల విడుదలైన 1 మినిట్ మ్యూజికల్ ప్రివ్యూ ‘‘ఏయ్ పిల్లా’’ అనే సాంగ్ ప్రివ్యూకు మంచి ఆదరణ లభించింది. ‘‘ఏయ్ పిల్లా’’ ఫుల్ లిరికర్ వీడియోను మార్చి 11న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. హోలీ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేసింది టీం. ఇందులో బైక్ మీద కూర్చున్న హీరో నాగ చైతన్యతో హీరోయిన్ సాయి పల్లవి ఎదో టీజ్ చేస్తున్నట్టుగా ఉన్న తీరు క్యూట్ గా ఉంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న లవ్ స్టోరీ ఈ వేసవి లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి 

పి.ఆర్.వో -జి.ఎస్.కె మీడియా

మ్యూజిక్ : పవన్ సి.హెచ్

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు

రచన- దర్శకత్వం : శేఖర్ కమ్ముల.

Love Story Movie Ay Pilla Full Song Release Details:

Ay Pilla song from Love Story Release on March 11

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ