Advertisementt

బన్నీసరసన రొమాంటిక్ హీరోయిన్..

Tue 10th Mar 2020 05:52 PM
ketika sharma,allu arjun,bunny,aha  బన్నీసరసన రొమాంటిక్ హీరోయిన్..
Romantic heroine to act with BUNNY బన్నీసరసన రొమాంటిక్ హీరోయిన్..
Advertisement
Ads by CJ

అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వందశాతం తెలుగు కంటెంట్ ని ప్రేక్షకుల ముందుకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ కి ఉన్న డిమాండ్ వల్ల ప్రతీ ఒక్కరూ ఇటుసైడ్ చూస్తున్నారు. అయితే తెలుగులో ఆ అవకాశాన్ని మొదట అందిపుచ్చుకుంది మాత్రం అల్లు అరవిందే. అయితే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ని స్టార్ చేయనైతే చేశాడు గానీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడంలో మాత్రం వెనకబడుతున్నాడు.

ప్రస్తుతం ఆహాని విజయ్ దేవరకొండ ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ప్రమోషన్ లో స్పీడ్ పెంచడానికి అల్లు అరవింద్ బన్నీని రంగంలోకి దించుతున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో కలిసి ఆహా గురించి రామోజీ ఫిలిమ్ సిటీలో ఒక యాడ్ ని రూపొందించారట. ఈ యాడ్ బన్నీతో పాటు కేతికా శర్మా కూడా నటించిందని సమాచారం. కేతికా శర్మ పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా మరికొది రోజుల్లో విడుదలకి సిద్ధంగా ఉంది. తన సినిమా రిలీజ్ కి ముందుగానే బన్నీతో ఇలాంటి అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి. 

Romantic heroine to act with BUNNY:

Kethika sharma act with Bunny in Aha ad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ