సున్నితమైన ప్రేమకథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా లవ్ స్టోరీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తెలంగాణ గ్రామీణ ప్రాంత యువకుడిగా నాగచైతన్య కనిపిస్తాడట. ఇందుకోసం చైతన్య తెలంగాణ మాండలికాన్ని కూడా నేర్చుకున్నాడట. ఈ సినిమాలో చైతన్య పర్ ఫార్మెన్స్ తన కెరీర్లోనే హైలైట్ గా నిలిచేలా ఉంటుందని సమాచారం.
అయితే సమ్మర్ లో విడుదలకి సిద్ధం అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా కోసం 8 గంటల ఫుటేజీని తీశాడట. సాధారణంగా రెండున్నర గంటల సినిమా కోసం మూడు నుండు మూడున్నర గంటల సినిమా తీయడమే చాలా ఎక్కువ అనుకుంటే శేఖర్ కమ్ముల ఏకంగా ఎనిమిది గంటల ఫుటేజీ తీశాడని ఫిలిమ్ నగర్లో వార్తలు వస్తున్నాయి.
ఆ ఎనిమిది గంటల ఫుటేజీని కట్ చేసి రెండున్నర గంటల సినిమాగా చేయడానికి ఎడిటర్స్ చాలా కష్టపడుతున్నారని సమాచారం. అనుభవం ఉన్న శేఖర్ కమ్ముల ఇంత రష్ తీయడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. మరి అంతలా తీయడం ఎంతవరకు కరెక్టో శేఖర్ కమ్ములకే తెలియాలి. ఈ సినిమా మే 29న విడుదలకి సిద్ధంగా ఉంది.