పవన్ కళ్యాణ్ కి గతంలో స్టార్ డమ్ ఓ రేంజ్ లో ఉండేది. పవన్ క్రేజ్ ముందు ఏ హీరో అయినా బలాదూర్ అన్న రేంజ్ లో ఉండేది. రెండేళ్ళకి ఓ సినిమా చేసినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గేది కాదు. పవన్ కి యాక్షన్ సినిమాల కన్నా కామెడీ, పంచ్ డైలాగ్స్ ఉన్న సినిమాలే ఎక్కువ పేరు తెచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా కేరెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి కామెడీ పండించేవాడు. ఉదాహరణకు జల్సా, అత్తారింటికి దారేది సినిమాల్లో పవన్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ కేరెక్టర్స్ కి పవన్ కరెక్ట్ అనేలా ఉన్నాయి. అయితే రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ దిల్ రాజు బ్యానర్ ద్వారా గ్రాండ్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో సినిమా సెట్స్ లో ఆడుతూ పాడుతూ కమెడియన్స్ ని అల్లరి పట్టిస్తూ చాలా ఎనర్జీగా ఉండే పవన్ లో ఇప్పుడు మునుపటి ఉత్సాహం కరువైంది అని అంటున్నారు.
సినిమా సెట్స్ లో ఉన్నామా షూటింగ్ కంప్లీట్ చేశామా లేదా అనేలా పవన్ ప్రవర్తన ఉందని పింక్ రీమేక్ వకీల్ సాబ్ విషయంలో వేణు శ్రీరామ్ కంగారు పడడానికి ఏం లేదు. కానీ పవన్ మోహంలో మునుపటి ఉత్సాహం మిస్ అయ్యింది అంటున్నారు. మరోపక్క క్రిష్ కూడా చాలా స్పీడుగా సినిమా షూటింగ్ చేస్తాడు గనక పవన్ తో ఉన్న డేట్స్ ని పర్ఫెక్ట్ గా మ్యానేజ్ చేస్తాడు. మిగతా దర్శకనిర్మాతలకే పవన్ తో చుక్కలు కనబడే అవకాశం ఉన్నది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి డేట్స్ ఇంపార్టెంట్ కాదు.. కేవలం పారితోషకమే ఇంపార్టెంట్ అన్న రేంజ్ లో సినిమా షూటింగ్ చేస్తున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో ప్రచారంలో ఉంది. సినిమాకి 50 కోట్లు పట్టుకెళ్ళే పవన్ కి సినిమా షూటింగ్, ప్రమోషన్స్, అలాగే డేట్స్ తో పని లేదట. కేవలం షూటింగ్ చేశామా లేదా అన్న రేంజ్ లో పవన్ యాటిట్యూడ్ ఉందట. మరి పవన్ తో ఎలా వేగేది అంటూ నిర్మాతలు అప్పుడే తలలు పట్టుకుంటున్నారనే టాక్ ఫిలింనగర్ లో స్ప్రెడ్ అయ్యింది.