హీరోయిన్ గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేని రెజీనా కెసాండ్రా మొన్న వచ్చిన ఎవరు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అడవి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రెజీనాకి మంచి అవకాశం దక్కింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఎవరు చిత్రంలో రెజీనా నట విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. ఎవరు హిట్ అవడంతో ఆమెకి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం రెజీనా నేనే నా అనే ప్రయోగాత్మక సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది.
అదలా ఉంచితే రెజీనాకి మరో మంచి అవకాశం వచ్చింది. చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసే అవకాశం రెజీనాకి వచ్చింది. ఒకానొక స్పెషల్ సాంగ్ లో రెజీనా చిరంజీవితో కలిసి డాన్సులు చేసింది. ఈ పాట చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్ లో చిత్ర్రీకరణ జరుపుకుంది.
అయితే చిరంజీవితో స్టెప్పులు వేయడం తను లైఫ్ లో మర్చిపోలేదట. ఈ స్పెషల్ సాంగ్ లో తనకి అవకాశం రావడం అదృష్టంగా ఫీల్ అవుతున్నానని చెప్పింది. ఇంకా ఈ పాటకి సెలెబ్రేషన్ సాంగ్ అనే కొత్త పేరు కూడా పెట్టింది. మళ్ళీ ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేస్తారా అని అడగ్గా.. అలాంటి అవకాశమే లేదని ఇదే నా కెరీర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ అని చెప్పుకొచ్చింది. మరి సెలెబ్రేషన్ సాంగ్ నిజంగా సెలెబ్రేట్ చేసుకునేలాగా ఉంటుందని ఆశిద్దాం.